శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. స్పందించిన నటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితను..

Sri Reddy

సినీనటి శ్రీ రెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆమెపై టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితను శ్రీ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తోందని రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు.

సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీరెడ్డి ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ ఎన్నికల ముందు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది.

టీడీపీ నేతలను కించపరిచేలా శ్రీరెడ్డి మాట్లాడుతున్నారని రాజు యాదవ్ మీడియాకు తెలిపారు. ఆమె తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డిని చూసి ఇంకొందరూ నేర్చుకునే అవకాశం ఉందని చెప్పారు. శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, శ్రీరెడ్డి అప్పట్లో టాలీవుడ్ నటులపై కూడా తీవ్ర ఆరోపణలు చేసి కలకలం రేపిన విషయం తెలిసిందే.

శ్రీరెడ్డి స్పందన
కేసులపై శ్రీరెడ్డి స్పందించింది. ‘కడప, హైదరాబాద్, కర్నూల్‌లో నా మీద కేసులంట.. ఎంజాయ్ టీడీపీ బ్యాచెస్’ అంటూ శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది.

Also Read: సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోలు వైరల్

ట్రెండింగ్ వార్తలు