Gadar 2 : గదర్ 2 సినిమా 500 కోట్ల సక్సెస్ పార్టీ.. సల్మాన్, షారుఖ్‌తో సహా తరలి వచ్చిన బాలీవుడ్..

తాజాగా బాలీవుడ్ లో స్పెషల్ సక్సెస్ పార్టీ నిర్వహించింది గదర్ 2 చిత్రయూనిట్. నిన్న శనివారం రాత్రి ముంబైలోని ఓ ప్రైవేట్ ప్లేస్ లో గదర్ 2 సక్సెస్ పార్టీ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ అంతా తరలి వచ్చారు.

Gadar 2 Movie 500 Crores Success Party all Bollywood stars attends to Gadar 2 Success Party and appreciate Movie Team

Gadar 2 Success Party :  బాలీవుడ్(Bollywood) లో ఇటీవల సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) గదర్ 2 సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 వచ్చింది. అమీషా పటేల్(Ameesha Patel) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాకిస్థాన్- ఇండియా బోర్డర్ కథతో పాటు ఓ ప్రేమకథని కూడా కలిపి ఎమోషనల్ గా తెరకెక్కించారు.

ఆగస్టు 11న థియేటర్స్ లో రిలీజయిన గదర్ 2 సినిమా థియేటర్స్ లో అదరగొడుతుంది. ఊహించనంతగా గదర్ 2 సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే 480 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వీకెండ్ తో 500 కోట్ల క్లబ్ లోకి గదర్ 2 సినిమా ఎంటర్ అవ్వనుంది. ఈ సినిమాని 100 కోట్లతో తెరక్కించగా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది.

గదర్ 2 సక్సెస్ పై చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సక్సెస్ మీట్స్ నిర్వహించగా తాజాగా బాలీవుడ్ లో స్పెషల్ సక్సెస్ పార్టీ నిర్వహించింది గదర్ 2 చిత్రయూనిట్. గదర్ 2 సక్సెస్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ అందరిని పిలిచారు. నిన్న శనివారం రాత్రి ముంబైలోని ఓ ప్రైవేట్ ప్లేస్ లో గదర్ 2 సక్సెస్ పార్టీ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ అంతా తరలి వచ్చారు.

Pawan Kalyan Birthday : న్యూయార్క్ టైంస్క్వేర్ వద్ద పవన్ కళ్యాణ్ బర్త్ డే.. ఈ స్పెషల్ వీడియో చూశారా?

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ, కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా, సారా అలీఖాన్, కృతి సనన్, అమీర్ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శిల్పా శెట్టి, అనన్య పాండే, బాబీ డియోల్, సునీల్ శెట్టి, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్.. ఇలా బాలీవుడ్ స్టార్స్ అంతా గదర్ 2 సక్సెస్ పార్టీకి తరలి వచ్చారు. వీరే కాక మరింతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. దీంతో బాలీవుడ్ అంతా ఒకేచోట చేరింది. బాలీవుడ్ అంతా గదర్ 2 జంట సన్నీ డియోల్, అమీషా పటేల్ తో పాటు చిత్రయూనిట్ అందర్నీ ప్రత్యేకంగా అభినందించింది. ప్రస్తుతం గదర్ 2 సక్సెస్ పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీల ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గదర్ 2 సక్సెస్ బాలీవుడ్ కి మరింత జోష్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు