Kantara: కాంతార సినిమా వీక్షించిన నిర్మలా సీతారామన్..

కన్నడలో ఒక సాధారణ సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా "కాంతార". కర్ణాటకలోని గ్రామీణ సంప్రదాయాలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అందరకి ఒక కొత్త కథ చూసాం అనే భావన కలిగిస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా వీక్షించారు.

Kantara: కన్నడలో ఒక సాధారణ సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా “కాంతార”. సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడనాట అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో, మూవీ మేకర్స్ ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేశారు. కథ బాగుంటే ప్రేక్షకులు ప్రాంతీయ బేధాలు లేకుండా ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువయింది.

Kantara: కాంతార తొలి హీరో రిషబ్ కాదా.. ఆయన అయి ఉంటే వేరే లెవెల్..!

కర్ణాటకలోని గ్రామీణ సంప్రదాయాలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అందరకి ఒక కొత్త కథ చూసాం అనే భావన కలిగిస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా వీక్షించారు. ఈ బుధవారం బెంగళూరులో కుటుంబసభ్యులు మరియు సన్నిహితులతో కలిసి ఆమె సినిమాను చూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. “కాంతార సినిమా ద్వారా కన్నడలోని తుళువనాడు మరియు కరవాలి వారి ఆచారాలను చాలా చక్కగా చూపించారు.

రచయత, దర్శకుడు మరియు నటుడు అయిన రిషబ్ శెట్టి అద్భుతమైన నటన కనబరిచాడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల జీవిన విధానాన్ని మరియు వారి ఆచారాల్ని చాలా చక్కగా చూపించారు” అంటూ రిషబ్ ని కొనియాడారు నిర్మల సీతారామన్. కెజిఫ్ చిత్రాలను తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్స్ అందుకుని దూసుకుపోతుంది.

ట్రెండింగ్ వార్తలు