Ponniyin Selvan 1 Review : పొన్నియిన్ సెల్వన్ 1 రివ్యూ.. పక్కా తమిళ సినిమా..కొత్త సీసాలో పాత సాంబార్..

సినిమాలోని క్యారెక్టర్స్ పేర్లు, మాటలు, సన్నివేశాలు ఇదంతా చూస్తే పక్కా తమిళ సినిమా అసలు మనకు సంబంధమే లేదు అనిపిస్తుంది.అందరికి తెలిసిన చోళులు, పాండ్యుల కథని కొత్తగా స్టార్ క్యాస్ట్ తో వడ్డించేసారు. కొత్త పాత్రలో పాత సాంబార్, తమిళ తంబిలకు మాత్రమే.........

Ponniyin Selvan 1 Review :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి ఎంతోమంది స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ కి ముందునుంచే భారీగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కొంతమంది ఈ సినిమాని బాహుబలితో పోల్చారు. ట్రైలర్ చూస్తే కూడా ఇదేదో చాలా గ్రాండియర్ గానే ఉండబోతుంది అని అంతా అనుకున్నారు.

పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. సినిమాపై ఉన్న అంచనాలకి, చిత్ర యూనిట్ ఇచ్చిన హైప్ కి తెరమీద సంబంధం లేదు అంటున్నారు చుసిన వాళ్ళు. తమిళ్ వాళ్ళు ఈ సినిమా సూపర్ డూపర్ అంటున్నా మిగిలిన వాళ్లంతా అంతేమి లేదు అని తేల్చేశారు. ముందు నుంచి చెప్పినట్టే ఇది చోళుల కథ. పక్కా తమిళ సినిమా. ఒక ప్రాంతానికి మాత్రమే తెలిసిన, పరిమితమైన కథని యూనివర్సల్ సబ్జెక్టు అనుకోవడం దర్శకుడు చేసిన మొదటి తప్పు.

కథ విషయానికి వస్తే గతంలో చోళులు, పాండ్యులు అని తమిళ్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో కూడా అదే పాత కథ చోళులు, పాండ్యులు మధ్య ఉన్న వైరాన్ని చూపించారు. కాకపోతే ఇందులో చోళులలోనే వారిలో వారికి ఉన్న విబేధాలు, సింహాసనం కోసం వేసే ఎత్తులు చూపించారు. చోళ రాజుని అంతం చేయాలని ఓ వైపు పాండ్యులు, మరో వైపు చోళులలోనే ఉన్న కొంతమంది సామంత రాజులు కలిసి ఆడే ఆటని చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కార్తీ కనపడినప్పుడు తప్ప మిగిలిన టైం అంతా బోర్ కొడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే సినిమాని కార్తినే నడిపించాడు.

Balakrishna : బాలయ్య బాబు కొత్త లుక్.. ఆహా కోసం సరికొత్తగా.. బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ అంట..

ఇక సెకండ్ హాఫ్ లో కొంచెం సేపు బోర్ కొట్టినా చివరి అరగంట మాత్రం పర్వాలేదనిపిస్తుంది. చివరి అరగంట విజువల్స్ చాలా బాగున్నాయి. సముద్రంలో తీసిన విజువల్స్ హాలీవుడ్ సినిమా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ని గుర్తు చేస్తాయి. ఆ విజువల్స్ అన్ని చాలా గ్రాండియర్ గా ఉంటాయి. ఇక సినిమా అంతా రాజుల కాలంలోది కాబట్టి దుస్తులు, అలంకరణ, నగలు, కోటలు బాగా చూపించారు. ఇక సినిమా టైటిల్ పొన్నియిన్ సెల్వన్ అనేది జయం రవినే అని సెకండ్ హాఫ్ లోనే చూపించేశాడు. క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా చేస్తుందనే చెప్పినా సెకండ్ పార్ట్ ని సినిమా ప్రేక్షకులు అంచనా వేసేస్తారు.

చాలా మంది స్టార్స్ ని తీసుకున్నా వాళ్లంతా తేలిపోయారు. ఐశ్వర్య, త్రిష, విక్రమ్, ప్రభు.. వీళ్ళని దర్శకుడు సరిగ్గా వాడుకోలేదనే చెప్పొచ్చు. విక్రమ్ ఐశ్వర్య రాయ్ గురించి చెప్పే సన్నివేశాలు ప్రేక్షకులకి నచ్చేలా లేవు. ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసి నీరసంగా చేసినా సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించి క్లైమాక్స్ ట్విస్ట్ తో పార్ట్ 2కి ఇచ్చిన లీడ్ పర్వాలేదనిపించింది. అది కూడా లేకపోతే సినిమా పని తమిళ్ లో కూడా అయిపోయేది. సినిమాకి కార్తీ చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఒకరకంగా కార్తీనే ఈ మొదటి భాగంలో హీరో. ఇక జయం రవి కూడా సెకండ్ హాఫ్ లో అదరగొట్టేసాడు. జయం రవినే పొన్నియిన్ సెల్వన్ అని చెప్పడంతో సెకండ్ పార్ట్ ని ప్రేక్షకులు అంచనా వేయగలరు. రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. కొన్ని చోట్ల మ్యూజిక్ ఎక్కడ్నుంచో కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. పాటలు, మాటలు చూస్తుంటే ఒక తమిళ డబ్బింగ్ సినిమా అని ఫీల్ వస్తుంది కానీ KGF లాగా వేరే భాష సినిమా అయినా మన సినిమా, పాన్ ఇండియా సినిమా అనే ఫీల్ మాత్రం కలగలేదు ప్రేక్షకుడికి.

దర్శకుడు మణిరత్నం ఒక టెక్నీషియన్ గా ఈ సినిమాతో సక్సెస్ అయినా కథా, కథనం మాత్రం సరిగ్గా లేదనే చెప్పొచ్చు. సినిమాలోని క్యారెక్టర్స్ పేర్లు, మాటలు, సన్నివేశాలు ఇదంతా చూస్తే పక్కా తమిళ సినిమా అసలు మనకు సంబంధమే లేదు అనిపిస్తుంది. దీంతో తెలుగు వాళ్ళు ఈ సినిమాకి ఎక్కువ కనెక్ట్ అవ్వలేరు. ఇటీవల అందరూ పాన్ ఇండియా అని వెళ్తుండటంతో మణిరత్నం కూడా స్టార్ క్యాస్ట్ ని పెట్టి పాన్ ఇండియా అనడంలో తప్పులేదు. కానీ అతను ఎంచుకున్న కథ ఒక ప్రాంతానికి పరిమితమైనది కాబట్టి అది పాన్ ఇండియా సక్సెస్ అవుతుంది అనుకోవడం తప్పే. అందరికి తెలిసిన చోళులు, పాండ్యుల కథని కొత్తగా స్టార్ క్యాస్ట్ తో వడ్డించేసారు. కొత్త పాత్రలో పాత సాంబార్, తమిళ తంబిలకు మాత్రమే ఈ సినిమా అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. స్టార్ క్యాస్ట్ ఉండటంతో కలెక్షన్లు అయితే ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. పార్ట్ 1 చివర్లో ఇచ్చిన చిన్న ట్విస్ట్ తో అందరూ అంచనా వేయగలిగే సెకండ్ పార్ట్ ని మణిరత్నం ఎలా రన్ చేస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు