Jr NTR : తూర్పు గోదావరి జిల్లాలోని ఆ ఆలయానికి.. ఏకంగా అన్ని లక్షలు డొనేట్ చేసిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని సమాచారం.

Jr NTR Donated Huge Amount to a Temple in East Godavari District

Jr NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. దేవర, వార్ 2 సినిమాల షూటింగ్స్ తో బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ వరుసగా బయట, ఎయిర్ పోర్ట్స్ లో కనిపిస్తుండటంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read : Movie Theaters : తెలంగాణలో సినిమా థియేటర్స్ బంద్.. ఏకంగా పది రోజులు.. ఎందుకంటే..?

తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని సమాచారం. జగ్గన్నపేట భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ 12 లక్షల 50 వేల రూపాయలు విరాళం ఇచ్చారు. గుడి బయట దాతల పేర్లను రాళ్లపై పేర్లు రాయించగా ఎన్టీఆర్, భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని పేర్లు విరాళం ఇచ్చినట్టు రాశారు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ఎన్టీఆర్ ఏకంగా 12 లక్షల 50 వేలు ఓ ఆలయ నిర్మాణానికి విరాళం ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు దేవర, వార్ 2 సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయని భావిస్తున్నారు.