Movie Theaters : తెలంగాణలో సినిమా థియేటర్స్ బంద్.. ఏకంగా పది రోజులు.. ఎందుకంటే..?

ఈ సమ్మర్ సీజన్ సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ ఇచ్చింది.

Movie Theaters : తెలంగాణలో సినిమా థియేటర్స్ బంద్.. ఏకంగా పది రోజులు.. ఎందుకంటే..?

Telangana Single Screen Theaters Closing up to 10 Days

Movie Theaters : సాధారణంగా సమ్మర్ లో సినిమాలు రిలీజ్ ఎక్కువగా ఉంటాయి. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి స్కూల్, కాలేజీ పిల్లతో పాటలు, పేరెంట్స్ కూడా సినిమాలకు వస్తారు, కలెక్షన్స్ వస్తాయని అంతా భావిస్తారు. కానీ ఈ సమ్మర్ సీజన్ సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ ఇచ్చింది.

ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్నా చితకా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వసాగాయి. కానీ ఆ సినిమాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్ కి ఎవ్వరూ రావట్లేదు, ఓ పది మంది వచ్చినా ఆ కలెక్షన్స్ కరెంట్, రెంట్ లకు కూడా రావట్లేదు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలని చూస్తున్నాయని సమాచారం.

Also Read : Double ISMART Teaser : డబల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. దిమాక్ కిరికిరి టీజర్ అదుర్స్..

దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ పది రోజులు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్స్ కి జనాలు ఎవ్వరూ రావట్లేదని కారణంతోనే థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో చిన్న సినిమాలకు దొరికిన ఛాన్స్ కూడా పోతుంది, చిన్న సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. పది రోజులు అంటే ఈ వారం, వచ్చే వారం రిలీజ్ కి కూడా పలు చిన్న సినిమాలు ఉన్నాయి. రాజు యాదవ్, లవ్ మీ సినిమాలతో పాటు మరి కొన్ని చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. మరి ఇవన్నీ రిలీజ్ అవుతాయా లేదా వాయిదా వేసుకుంటారా చూడాలి. మొత్తానికి ఈ సమ్మర్ సినీ పరిశ్రమకి భారీ నష్టాన్నే మిగిల్చింది.