Aavesham : ఒక్క డైలాగ్‌తో.. భాషా వివాదానికి దారి తీసిన ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమా..

ఆవేశం సినిమాలోని ఓ డైలాగ్ వివాదానికి దారితీసింది.

Fahadh Faasil Aavesham Movie in Language Controversy

Aavesham Movie Issue : ఇటీవల మలయాళం సినిమాలు వరుసగా మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే పుష్ప నటుడు, మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ ఆవేశం సినిమాతో వచ్చాడు. ఏప్రిల్ 11న ఆవేశం సినిమా మలయాళం భాషలో మాత్రమే రిలీజ్ అయింది. అయినా ఈ సినిమా పెద్ద హిట్ అయి దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం మళయాళంలోనే రిలీజ్ అయినా వేరే భాషల్లో కూడా మంచి హిట్ అయింది ఆవేశం సినిమా.

ఇటీవలే ఆవేశం సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా కేవలం మళయాళంలోనే రిలీజ్ చేశారు. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఆవేశం సినిమాని ఓటీటీలో చూస్తున్నారు. దీంతో ఓటీటీలో కూడా ఆవేశం బాగా రీచ్ తెచ్చుకుంది. అయితే ఇపుడు ఈ సినిమాలోని ఓ డైలాగ్ వివాదానికి దారితీసింది. ఆవేశం సినిమాలో ఓ ఫైట్ సీన్ తర్వాత ఫహద్ ఫాజిల్ రంగ క్యారెక్టర్.. ముందు మలయాళంలో వార్నింగ్ ఇస్తాడు. అది బెంగుళూరులో జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత కన్నడలో వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత హిందీలో అదే వార్నింగ్ ఇచ్చేలోపు పక్కనే ఉండే రంగ అసిస్టెంట్ వచ్చి.. చాలు, అందరికి అర్థమైంది వెళ్దాం అంటే.. హిందీలో అక్కర్లేదా అని రంగ అడుగుతాడు దానికి రంగ అసిస్టెంట్ అవసర్లేదు అని అంటాడు.

Also Read : Jr NTR : తూర్పు గోదావరి జిల్లాలోని ఆ ఆలయానికి.. ఏకంగా అన్ని లక్షలు డొనేట్ చేసిన ఎన్టీఆర్..

అయితే సినిమాలో ఇది కామెడీ కోసం పెట్టినా ఈ డైలాగ్ బయట వివాదానికి దారి తీసింది. ఆవేశం సినిమా నార్త్ లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్ళు హిందీలో డైలాగ్ చెప్పక్కర్లేదు, అందరికి అర్థమైంది అని చెప్పడంతో హిందీ భాషని అవమానించారంటూ, హిందీలో సినిమాలు రిలీజ్ చేస్తారా? హిందీలో మాత్రం కలెక్షన్స్ కావాలా అంటూ నార్త్ లో ఆవేశం సినిమాపై విమర్శలు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సినిమా మలయాళం కాబట్టి డైలాగ్ ముందు మలయాళంలో చెప్పారు, తర్వాత ఆ కథ బెంగుళూరులో జరుగుతుంది కాబట్టి కన్నడలో చెప్పారు, తర్వాత వేరే భాషల్లో చెప్పడానికి ట్రై చేస్తుంటే వద్దు అని ఆపేసారు అది సీన్ పరంగా చూస్తే కామెడీ కోసం తీసినట్టు ఉంది అని ఆవేశం సినిమాని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మరి ఈ వివాదం పెద్దదవుతుందా, సోషల్ మీడియాలోనే వాదులాడుకొని వదిలేస్తారా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు