Devara : ఎన్టీఆర్ పుట్టిన రోజుకి దేవర అప్డేట్ అదే.. వైరల్ అవుతున్న ట్వీట్.. ఫ్యాన్స్ కి పండగే..

మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానులు దేవర సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Devara Update : ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ దేవర, వార్ 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ముంబైలో వార్ 2 షూటింగ్ జరుగుతుండగా, వైజాగ్ లో దేవర షూట్ జరుగుతుంది. ఇక మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానులు దేవర సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇటీవల దేవర మూవీ టీం పోస్ట్ చేసిన ఓ ట్వీట్ తో ఎన్టీఆర్ పుట్టిన రోజున దేవర సినిమా నుంచి మొదటి పాట వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. కొంతమంది గ్లింప్స్ కానీ, టీజర్ కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా మ్యూజిక్ ఛానల్ అయిన T సిరీస్ సౌత్ వస్తున్నాం అంటూ దేవర వీడియో క్లిప్ తో పాటు మ్యూజిక్ సింబల్స్ పోస్ట్ చేశారు. దీంతో T సిరీస్ సౌత్ ఛానల్ లో దేవర ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ పుట్టిన రోజున రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్వీట్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Vidya Vasula Aham : ‘విద్యా వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్.. పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే..

వీటితో పాటు వార్ 2 సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంచనా అవేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడే ఎన్టీఆర్ పుట్టిన రోజు హడావిడి చేసేస్తున్నారు. ఇక దేవర పార్ట్ 1 సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.