Vidya Vasula Aham : ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్.. పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే..

తాజాగా 'విద్య వాసుల అహం' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Vidya Vasula Aham : ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్.. పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే..

Rahul Vijay Shivani Rajashekar Vidya Vasula Aham Trailer Released

Updated On : May 15, 2024 / 3:51 PM IST

Vidya Vasula Aham Trailer : తెలుగు ఓటీటీ ఆహాలో(Aha) రెగ్యులర్ గా కొత్త కొత్త షోలు, సినిమాలు సందడి చేస్తాయి. తాజాగా మరో కొత్త సినిమా రాబోతుంది. రాహుల్ విజ‌య్‌, శివాని రాజ‌శేఖ‌ర్‌లు జంట‌గా తెరకెక్కిన సినిమా ‘విద్య వాసుల అహం’ ఆహా ఓటీటీలో మే 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎటర్నిటి ఎంట్రెర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మి నవ్య, రంజిత్ కుమార్ నిర్మాతలుగా మణికాంత్‌ గెల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈ విద్యా వాసుల అహం సినిమా తెరకెక్కింది.

Also Read : Aavesham : ఒక్క డైలాగ్‌తో.. భాషా వివాదానికి దారి తీసిన ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమా..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. భార్యాభర్తల మధ్య ఉండే క్యూట్ రిలేషన్ షిప్ తో పాటు ఇద్దరి మధ్య గొడవలు, అహంతో వచ్చే కష్టాలతో ఈ ‘విద్యా వాసుల అహం’ తెరకెక్కింది. ట్రైలర్ వైకుంఠంలో ఓపెన్ చేసి విష్ణువు – లక్ష్మి దేవికి గొడవ అయినట్టు, మధ్యలో నారదుడు ఉన్నట్టు చూపించి ఆసక్తిగా అసలు కథలోకి తీసుకెళ్లారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. భార్యాభర్తల బంధాన్ని మంచి రొమాంటిక్ కామెడీ కథతో చూపంచబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ చూసేయండి.