Pushpa The Rule: పుష్పరాజ్.. మొదలుపెట్టేది అప్పుడే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో తెరకెక్కినా, ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప - ది రూల్’ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే అనౌన్స్ చేయడంతో, ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో తెరకెక్కినా, ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప – ది రూల్’ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే అనౌన్స్ చేయడంతో, ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa 2: పుష్ప-2 కోసం మూడు.. దేవిశ్రీ ప్రసాద్ సెన్సేషన్!

ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇదిగో, అదిగో అంటూ రోజులు గడుస్తున్నా, పుష్ప 2 మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఇటీవల ఈ సీక్వెల్‌కు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్. ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంపై సుకుమార్ అండ్ టీమ్ ఓ క్లారిటీకి వచ్చారట.

Pushpa 2: పుష్ప-2.. మరింత గ్రాండియర్‌గా రాబోతున్న పుష్పరాజ్!

పుష్ప 2 చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ మూడో వారంలో ప్రారంభించాలని వారు పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ షూటింగ్ కోసం చిత్ర హీరోతో పాటు మిగతా నటీనటులు కూడా సిద్ధమయ్యారట. ఇక అఫీషియల్‌గా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు