Raviteja : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ అమర్ దీప్..

జాగా అమర్ దీప్ రవితేజ తో షూటింగ్ సెట్స్ లో దిగిన ఫోటోని షేర్ చేసి..

Amar Deep got acting chance in Raviteja Movie Photo goes Viral

Raviteja : సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్(Amar Deep) ఇటీవల బిగ్ బాస్(Bigg Boss) లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ముందు నుంచి కూడా అమర్ దీప్ మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్ అని చెప్పుకోవడం, పలు ఈవెంట్స్ లో అతన్ని అనుకరిస్తూ డ్యాన్సులు, స్కిట్స్ చేసాడు. ఓ ఈవెంట్ లో రవితేజ ముందే రవితేజ సాంగ్స్ కి పర్ఫార్మ్ చేసి మెప్పించాడు.

అమర్ దీప్ బిగ్‌బాస్ లో ఉన్నప్పుడు రవితేజ తన సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ కి వచ్చాడు. అప్పుడు అమర్ దీప్ మరోసారి రవితేజపై తన ప్రేమని చూపించాడు. దీంతో రవితేజ నా సినిమాలో కచ్చితంగా నీకు ఛాన్స్ ఇస్తాను అని మాట ఇచ్చాడు.

Also Read : Manchu Lakshmi : హైదరాబాద్ సిగ్గుచేటు.. నేను ముంబై నుంచి ఓటు వేయడానికి వచ్చాను..

తాజాగా అమర్ దీప్ రవితేజ తో షూటింగ్ సెట్స్ లో దిగిన ఫోటోని షేర్ చేసి.. నా కల నెరవేరింది. నా దేవుడు నువ్వేనయ్యా. నువ్వంటే నాకు పిచ్చి, ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ పోస్ట్ చేసాడు. దీంతో రవితేజ సినిమాలో అమర్ దీప్ నటించాడని తెలుస్తుంది. రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకొని అమర్ దీప్ కి అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో రవితేజ అభిమానులు మరోసారి రవితేజని అభినందిస్తుంటే అమర్ దీప్ ఫ్యాన్స్ మంచి ఛాన్స్ కొట్టేసావు అని కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక అమర్ దీప్ హీరోగా కూడా ఓ సినిమా చేస్తున్నాడు.