Manchu Lakshmi : హైదరాబాద్ సిగ్గుచేటు.. నేను ముంబై నుంచి ఓటు వేయడానికి వచ్చాను..
మంచు లక్ష్మి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకుంది. మంచు లక్ష్మి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

Manchu Lakshmi Sensational Comments after Voting
Manchu Lakshmi : నేడు రెండు తెలుగు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలంతా ఉదయం నుంచే క్యూలైన్స్ లో నిల్చొని ఓట్లు వేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా అంతా వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు హైదరాబాద్ లోని తమ పోలింగ్ బూత్ లలో ఓట్లు వేసి అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు.
Also Read : Rajamouli : దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓటు వేసిన రాజమౌళి.. మహేష్ సినిమా వర్క్‌తో బిజీగా ఉన్నా..
మంచు లక్ష్మి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకుంది. మంచు లక్ష్మి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది మన జీవితం. ఓటేయడం మాములు హక్కు కాదు. మన దేశం అభివృద్ధి చెందడానికి, మన వాయిస్ వినిపించడానికి ఓటు వేయాలి. నా విన్నపం ఏంటి అంటే కొన్ని ఎలక్ట్రోల్ రిఫరెల్స్ మారాలి. నేను ముంబై నుంచి వచ్చాను ఓటు వేయడానికి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు వచ్చి ఓటు వేయాలంటే అందరికి కుదరకపోవచ్చు. డిజిటల్ ద్వారా ఓటింగ్, ఇక్కడికి రాకుండా ఓటు వేసే ఏమైనా మంచి మార్గం ఉంటే చూడాలి. హైదరాబాద్ లో ఇప్పటివరకు కేవలం 5 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది అంట, సిగ్గుచేటు. బయటకి వచ్చి ఓటు వేయండి. అందరూ బయటకి వచ్చి ఓటు వేయాలి అని తెలిపింది.