GV Prakash-Saindhavi : విడిపోయిన మ‌రో సినీ జంట‌.. భార్య‌కు విడాకులు ఇచ్చిన సంగీత ద‌ర్శ‌కుడు జీవి ప్ర‌కాష్.. 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి..

కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

Music Director GV Prakash Kumar And Wife Saindhavi Announce Divorce

GV Prakash – Saindhavi Divorce : కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా అనోన్యంగా ఉన్న జంటలు సైతం విడిపోతున్నాయి. 18 ఏళ్ల పాటు అనోన్యంగా క‌లిసి ఉన్న ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ లు విడిపోవ‌డాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు. తాజాగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, హీరో జీవి ప్ర‌కాష్ సైతం త‌న భార్య‌కు విడాకులు ఇచ్చారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవి ప్ర‌కాష్‌ ఆయ‌న భార్య‌, గాయ‌ని సైంధ‌వి త‌మ 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు ప‌లికారు. ఎంతో ఆలోచించాం.. చివరికి విడిపోవాలని తాను, సైంధవి నిర్ణయించుకున్నామ‌ని జీవి ప్ర‌కాష్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తెలియ‌జేశారు. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు.

Boney Kapoor : అజయ్ దేవగణ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. RRR, జవాన్ సినిమాలపై నిర్మాత వ్యాఖ్యలు..

‘ఇలాంటి స‌మ‌యంలో మా గోప‌త్య‌కు భంగం క‌లిగించ‌కుండా మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణ‌యాన్ని అర్థం చేసుకుంటామ‌ని ఆశిస్తున్నాం. మేము తీసుకున్న నిర్ణ‌యం ఇద్ద‌రికి మంచిద‌ని భావించిన త‌రువాత‌నే తీసుకున్నాం. ‘అంటూ జీవి ప్రకాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

కాగా.. ప్ర‌స్తుతం ఈ వార్త త‌మిళ‌నాట సంచ‌ల‌నం రేపుతోంది. వీరిద్ద‌రు విడిపోతార‌ని అభిమానులు అస్స‌లు ఊహించ‌లేదు.

Raviteja : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ అమర్ దీప్..

ఆస్కార్ గ్ర‌హిత ఏఆర్ రెహ‌మాన్ మేన‌ల్లుడే ఈ జీవి ప్ర‌కాష్‌. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌కంటూ ఓ మంచి గుర్తుంపును తెచ్చుకున్నాడు. సంగీత ద‌ర్శ‌కుడిగా నేష‌న‌ల్ అవార్డును సైతం అందుకున్నారు. 2013లో త‌న చిన్న‌నాటి స్నేహితురాలు గాయ‌ని సైంధ‌విని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్ద‌రి అన్వీ అనే కూతురు ఉంది.