Boney Kapoor : అజయ్ దేవగణ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. RRR, జవాన్ సినిమాలపై నిర్మాత వ్యాఖ్యలు..
తాజాగా నిర్మాత బోనీ కపూర్ మైదాన్ ఫ్లాప్ పై కామెంట్స్ చేశారు.

Boney Kapoor Comments on Ajay Devgn Maidaan Flop comparing with RRR and Jawan Movies
Boney Kapoor : ఇటీవల అజయ్ దేవగణ్ మైదాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 1950 – 1962 మధ్య ఇండియన్ ఫుట్ బాల్ టీం కథ, అప్పుడు ఉన్న ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా మైదాన్ సినిమా తెరకెక్కింది. అజయ్ దేవగన్(Ajay Devgn), ప్రియమణి(Priyamani) ముఖ్య పాత్రల్లో అమిత్ శర్మ దర్శకత్వంలో బోనికపూర్, జీ స్టూడియోస్ నిర్మాణంలో ఈ మైదాన్ సినిమా నిర్మించారు. ఇటీవల ఏప్రిల్ 10న మైదాన్ సినిమాని రిలీజ్ చేయగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అవ్వలేదు.
దాదాపు నాలుగేళ్లకు పైగా ఈ సినిమా కోసం కష్టపడి భారీ ఖర్చు పెట్టి తీసినా కనీసం 50 కోట్లు కూడా థియేట్రికల్ కలెక్షన్స్ రాలేదు. కానీ మంచి సినిమా అని అందరూ పొగిడారు. తాజాగా ఈ సినిమా నిర్మాత బోనీ కపూర్ మైదాన్ ఫ్లాప్ పై కామెంట్స్ చేశారు.
Also Read : Chetan Chandra : తల్లి ముందే కన్నడ నటుడిపై దాడి.. రక్తంతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి..
బోనీ కపూర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మైదాన్ సినిమా అద్భుతమైన సబ్జెక్ట్. అజయ్ దేవగణ్ కూడా అద్భుతంగా నటించారు. కానీ ప్రేక్షకుల డిమాండ్స్ మేము ఆలోచించలేదు. ఇప్పటి ఆడియన్స్ మైదాన్ లాంటి సినిమాల కన్న RRR, జవాన్, పఠాన్ లాంటి యాక్షన్ సినిమాలనే ఇష్టపడుతున్నారు అని అన్నారు.