Chetan Chandra : తల్లి ముందే కన్నడ నటుడిపై దాడి.. రక్తంతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి..
తెలియని వ్యక్తులు కొంతమంది కన్నడ నటుడిపై దాడి చేసిన ఘటన కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది.

Some Persons attacked on Kannada Actor Chetan Chandra Issue goes Viral
Chetan Chandra : తెలియని వ్యక్తులు కొంతమంది కన్నడ నటుడిపై దాడి చేసిన ఘటన కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది. కన్నడలో రాజధాని, జరాసంధ.. లాంటి పలు సినిమాల్లో నటించిన నటుడు చేతన్ చంద్ర నిన్న మాతృ దినోత్సవం కావడంతో తన తల్లితో కలిసి రాత్రి వేళ దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయం నుంచి తిరుగు ప్రయాణంలో తల్లితో కలిసి వస్తుండగా దాడి జరిగింది.
చేతన్ చంద్ర, తన తల్లితో కలిసి కార్ లో తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది దుండగులు చేతన్ చంద్ర కార్ ని ఫాలో అయి కార్ పై దాడి చేసి, కార్ అద్దాలు పగలకొట్టి అనంతరం చేతన్ చంద్రపై దాడి చేశారు. ఓ ఇరవై మంది కలిసి చేతన్ చంద్రపై రక్తం వచ్చేలా దాడి చేసి వెళ్లిపోయారు. రక్తం కారుతున్నా చేతన్ చంద్ర అలాగే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి ఈ ఘటన గురించి తెలిపాడు.
Also Read : Kannappa Teaser : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా మంచు విష్ణు ‘కన్నప్ప’ టీజర్ లాంచ్..
దీనిపై ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పలువురు నెటిజన్లు చేతన్ చంద్రకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. చేతన్ పై ఇలా దాడి జరగడాన్ని పలువురు కన్నడ సినీ ప్రముఖులు ఖండిస్తూ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమలో చర్చగా మారయింది. ప్రస్తుతం చేతన్ చంద్ర హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.