Kannappa Teaser : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా మంచు విష్ణు ‘కన్నప్ప’ టీజర్ లాంచ్..

తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు విష్ణు.

Kannappa Teaser : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా మంచు విష్ణు ‘కన్నప్ప’ టీజర్ లాంచ్..

Manchu Vishnu Announced Kannappa Movie Teaser will Release in Cannes Film Festival Date

Updated On : May 13, 2024 / 4:35 PM IST

Kannappa Teaser : మంచు విష్ణు(Manchu Vishnu) ‘కన్నప్ప’ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో, స్టార్ కాస్ట్ తో కన్నప్ప సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, నయనతార, మధుబాల.. లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

ఇప్పటికే కన్నప్ప సినిమా న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొని ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ షూటింగ్ లో ప్రభాస్ అడుగుపెట్టినట్టు మంచు విష్ణు తెలిపాడు. తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు విష్ణు.

Also Read : Raviteja : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ అమర్ దీప్..

మే 14 నుంచి మే 25 వరకు ఫ్రాన్స్ లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప సినిమా బృందం పాల్గొననుంది. మే 20న సాయంత్రం 6 గంటలకు కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికలో కన్నప్ప టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. ప్రపంచ వేదికపై భారతీయ చరిత్ర చూపెట్టడం గర్వంగా ఉందని తెలిపాడు విష్ణు. దీంతో అభిమానులు ఈ భారీ కన్నప్ప సినిమా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.