Skanda Review : స్కంద మూవీ రివ్యూ.. బోయపాటి మాస్ సంభవానికి.. రామ్ కల్ట్ జాతర తోడు.. దద్దరిల్లుతున్న థియేటర్స్..

రామ్ పోతినేని స్కంద మూవీ రివ్యూ. సినిమా మొదటి హాఫ్‌లో..

Ram Pothineni Boyapati Srinu Sreeleela Skanda movie Review audience response

Skanda Movie Review : మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో తెరకెక్కిన ఊర మాస్ సినిమా ‘స్కంద‌’. రామ్ ని ఇప్పటివరకు చూడనంత మాస్ గా ఈ మూవీలో చూపించారు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించగా శ్రీకాంత్, పృథ్వీ, ఇంద్రజ, గౌతమి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్ అండ్ ట్రైలర్స్ తో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న స్కంద నేడు సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికి వస్తే ఒక పెద్ద బిజినెస్ మెన్ ని వాళ్ళ పని ఒప్పుకోనందుకు రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి ఇబ్బంది పెట్టి ఉరి దాకా తీసుకెళ్తే హీరో ఏం చేసి ఆ ఇద్దరు సీఎంల నుండి ఆ బిజినెస్ మెన్ ని కాపాడాడు అనేది కథ. అయితే కథని స్క్రీన్ ప్లేలో చాలా బాగా రాసుకున్నారు. మొదటి హాఫ్ అంత ఇద్దరు సీఎంలు కొట్టుకున్నట్టు ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో సీఎంలు ఏం చేశారు చూపించి హీరో వాళ్ళ కోసం ఏం చేశాడు అనేది చూపించారు.

Also Read: రిషి సునక్‌ను కలిసిన ట్వింకిల్, అక్షయ్.. కారణం ఏంటంటే?

సినిమా అంతా బోయపాటి మాస్ మార్క్ కనిపిస్తుంది. బోయపాటి సినిమాలంటే ఫైట్స్ ఎలా ఉంటుందో తెలిసిందే. స్కంద సినిమాలో బోయపాటి గత సినిమాల కంటే మించి ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఇక బోయపాటి సినిమాల్లో ఫ్యామిలీలు, ఎమోషన్స్ కూడా పక్కాగా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ లో మంచి ఫ్యామిలీ ఎమోషన్ నడిపించి, తల్లితండ్రుల గొప్పతనం చెప్పి కన్నీళ్లు పెట్టిస్తాడు. ఇక రామ్ ఊర మాస్ గా మారి తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. డ్యూయల్ రోల్ లో రామ్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చి మెప్పించాడు.

Also Read : షారుఖ్‌కి విజయ్ ‘లవ్ యు’ రిప్లై.. బాత్ రూమ్ నుంచి బయటకి రా అంటున్న దర్శకుడు..

సినిమాలో మొదటి హాఫ్ లో కామెడీ సన్నివేశాలు కూడా వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడా గవర్నమెంట్ మీద కౌంటర్లు ఉంటాయి. శ్రీలీల తన డ్యాన్స్ తో అన్ని పాటల్లోనూ మెప్పించింది. థమన్ BGM ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. కానీ సాంగ్స్ మాత్రం మైనస్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది, క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. మొత్తంగా మాస్ ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి, B C సెంటర్స్ కి మాత్రం రామ్ కల్ట్ మాస్ జాతర ఇచ్చాడు. థియేటర్స్ ని బోయపాటి రామ్ కలిసి దద్దరిల్లేలా చేస్తున్నారు. క్లైమాక్స్ లో స్కంద 2 సినిమాకి లీడ్ ఇచ్చి వదిలేశారు. అయితే సినిమాకి స్కంద అనే టైటిల్ ఎందుకు పెట్టారో మాత్రం అర్ధం కాదు.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..

ట్రెండింగ్ వార్తలు