Senior Actor Naresh Tweets : పెప్సి, పాప్‌కార్న్‌ రేట్లు తగ్గించకపోతే జనాలు థియేటర్లకు రారు.. సీనియర్ నటుడు నరేష్ ట్వీట్..

నరేష్ ఈ ట్వీట్ లో.. ''టికెట్‌ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్‌కు రావట్లేదు అనేది నిజమే కావొచ్చు. కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్‌కార్న్‌ రూ.20, రూ.30కే థియేటర్స్ క్యాంటిన్ లలో దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300 అయింది. ఒక కుటుంబం మొత్తం.................

Senior Actor Naresh Tweets :  ఇటీవల థియేటర్లకు జనాలు రావడం తగ్గించిన సంగతి తెలిసిందే, హిట్ సినిమాలకి కూడా కలెక్షన్స్ లేక, వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇటీవల నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ మీటింగ్స్ పెట్టి దీనిపై చర్చించారు. జనాల్ని థియేటర్స్ కి ఎలా తీసుకురావాలి అని ఆలోచనలు చేశారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా సలహాలు ఇచ్చారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ థియేటర్లకు జనాలు ఎందుకు రావట్లేదో అంటూ ట్వీట్స్ చేశారు.

నరేష్ ఈ ట్వీట్ లో.. ”టికెట్‌ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్‌కు రావట్లేదు అనేది నిజమే కావొచ్చు. కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్‌కార్న్‌ రూ.20, రూ.30కే థియేటర్స్ క్యాంటిన్ లలో దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300 అయింది. ఒక కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడాలంటే దాదాపు రూ.2500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా రేట్లు ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు. వాళ్లకి కావాల్సింది మంచి సినిమా మాత్రమే కాదు, మంచి అనుభవం కూడా” అని ట్వీట్ చేశారు.

NTR30: ఎన్టీఆర్ సినిమాకు ఆ బ్యూటీ నో చెప్పిందా..?

మరో ట్వీట్ చేస్తూ.. ”ఒకప్పుడు సినిమాలు వారం రోజులపైనే ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్‌ ఖాళీ అయిపోతుంది. థియేటర్స్‌లో ఖర్చు తగ్గిస్తే ప్రేక్షకులు ఎక్కువసార్లు సినిమా చూడటానికి వస్తారు” అని తెలిపారు. నరేష్ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు