Sita Ramam: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించగా, ఈ సినిమాను ప్రెస్టీజియస్ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వనీ దత్ ప్రొడ్యూస్ చేస్తుండటంత ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ గెస్ట్‌గా రావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Sita Ramam: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సీతా రామం’!
అయితే రిలీజ్‌కు మరొక రోజు మాత్రమే ఉండగా, సీతా రామం చిత్రానికి షాక్ ఎదురైంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మతపరమైన కొన్ని సీన్స్ ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ తెలిపిందట. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మరోసారి సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుందట.
Sita Ramam : సీతారామం ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ఈ సినిమాలో స్టార్ బ్యూటీ రష్మిక మందన, సుమంత్, భూమిక వంటి పులువు స్టార్స్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో నిజంగానే బ్యాన్ చేస్తారా.. లేక అభ్యంతకరంగా ఉన్న సీన్స్‌ను తొలగించి అక్కడ రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా రిలీజ్‌కు ముందుకు సీతా రామం సినిమాకు ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.