Alia Bhatt : రచయితగా మారిన స్టార్ హీరోయిన్.. పిల్లల కోసం ఫస్ట్ బుక్ రిలీజ్ చేసి..

అలియా భట్ ఓ పక్క సినిమాలు, మరో పక్క ఫ్యామిలీతో బిజీగా ఉన్నా రచయితగా మారింది.

Alia Bhatt : బాలీవుడ్ భామ అలియా భట్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే మరో పక్క పెళ్లి చేసుకొని, పాపని కని ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తుంది. అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది, వీరికి రాహా అనే క్యూట్ పాప ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బాలీవుడ్ జంట తమ పాపాయి కోసం ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు.

అలియా భట్ ఓ పక్క సినిమాలు, మరో పక్క ఫ్యామిలీతో బిజీగా ఉన్నా రచయితగా మారింది. పిల్లల పుస్తకాల రచయితగా మారిన అలియా భట్ తన మొదటి పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసింది. ‘Ed finds a Home’ అనే పేరుతో అలియా భట్ తన మొదటి పిల్లల పుస్తకాన్ని రిలీజ్ చేసింది.

Also Read : Kalki 2898 AD : RRR కంటే ఫాస్ట్‌గా ‘కల్కి’ కలెక్షన్స్.. సైలెంట్‌గా రిలీజ్ ముందే రికార్డులు సెట్ చేస్తున్న కల్కి..

ఈ పుస్తకంతో అలియా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కొత్త ప్రయాణం మొదలైంది. ‘Ed finds a Home’ అనేది ఒక కొత్త సిరీస్ బుక్స్, Ed-a-mamma యూనివర్స్ నుంచి మరిన్ని పుస్తకాలు రానున్నాయి. నా చిన్నతనం అంతా చాలా కథలు వింటూ పెరిగాను. ఒక రోజు నేను నాలోని చిన్న పిల్లని బయటకి తీసుకొచ్చి కథలు అన్ని పుస్తక రూపంలో మార్చి పిల్లలకు అందించాలని అనుకున్నాను. వివేక్ కామత్, షబ్నమ్, తాన్వి భట్.. ఈ ప్రయాణంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు, మా ఫస్ట్ బుక్ బయటకు రావడానికి ఎన్నో ఐడియాలు ఇచ్చారు. ఈ పుస్తకం ఆన్లైన్ లో లేదా ప్రముఖ పుస్తక షాప్స్ లో లభిస్తుంది అని పోస్ట్ చేసింది. దీంతో అలియా రచయితగా మరో కొత్త ప్రయాణం ప్రారంభించింది అని అభినందనలు తెలుపుతున్నారు. అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు