Kalki 2898 AD : RRR కంటే ఫాస్ట్‌గా ‘కల్కి’ కలెక్షన్స్.. సైలెంట్‌గా రిలీజ్ ముందే రికార్డులు సెట్ చేస్తున్న కల్కి..

సాధారణంగా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తేనే గొప్పగా చెప్పుకుంటాయి మన తెలుగు సినిమాలు.

Kalki 2898 AD : RRR కంటే ఫాస్ట్‌గా ‘కల్కి’ కలెక్షన్స్.. సైలెంట్‌గా రిలీజ్ ముందే రికార్డులు సెట్ చేస్తున్న కల్కి..

Prabhas Kalki 2898AD Movie creates new Records in Collections Before Release

Kalki 2898 AD : ప్రభాస్(Prabhas) కల్కి 2898AD సినిమా కోసం అభిమానులు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇలా స్టార్ నటీనటులు చాలా మంది ఈ సినిమాలో నటిస్తుండగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

కల్కి సినిమాకు విదేశాల్లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఇక అమెరికాలో అయితే మన తెలుగు సినిమాలకు సాధారణంగానే మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమా, అందులోను హాలీవుడ్ రేంజ్ లో తీస్తుండటంతో అమెరికా ప్రేక్షకులు, అక్కడి తెలుగు వాళ్ళు కల్కి కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్ కి ఇంకా 10 రోజులు టైం ఉన్నా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో చాలా ఫాస్ట్ గా 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసేసింది కల్కి సినిమా.

Also Read : Trivikram : పవన్ గెలుపు.. తిరుమలకు కాలి నడకన త్రివిక్రమ్.. త్రివిక్రమ్ తనయుడిని చూశారా?

సాధారణంగా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తేనే గొప్పగా చెప్పుకుంటాయి మన తెలుగు సినిమాలు. అలాంటిది రిలీజ్ కి ముందే 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది కల్కి. అంతకుముందు అమెరికాలో రిలీజ్ కి ముందే ఫాస్ట్ గా 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన తెలుగు సినిమా RRR సినిమా మాత్రమే. ఇప్పుడు RRR సినిమా కంటే కూడా ఫాస్ట్ గా కల్కి సినిమా 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసేసింది.

ఈ హవా చూస్తుంటే రిలీజ్ కి ముందే కల్కి సినిమా 3 మిలియన్ డాలర్స్ ఈజీగా వసూలు చేస్తుందని తెలుస్తుంది. అసలు ప్రమోషన్స్ చెయ్యట్లేదు అని విమర్శలు వస్తుంటే సైలెంట్ గానే కలెక్షన్స్ వసూలు చేస్తుంది కల్కి. ఇక్కడ కూడా సైలెంట్ గా రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుంది అని అభిమానులు అంటున్నారు. ఇక ఇండియన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్స్ బుక్ చేసుకుంటాము అని అంటున్నారు.