పవన్ కల్యాణ్ ఓకేఅంటే అదే క్యాంపు కార్యాలయం.. గతంలో దేవినేని, బొత్స..

విజయవాడలో తనకోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఇప్పటికే ఇదే కార్యాలయంను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించి సానుకూలంగా స్పందించారు.

Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన పవన్ కల్యాణ్ కు జనసేన పార్టీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. విజయవాడలో తనకోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ పరిశీలించారు. ఇప్పటికే ఇదే కార్యాలయంను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించి సానుకూలంగా స్పందించారు.

Also Read : ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

పవన్ కల్యాణ్ ఆ కార్యాలయాన్ని మంగళవారం పరిశీలించారు. ఆయన ఓకే అంటే అదే కార్యాలయం క్యాంపు కార్యాలయంగా మార్చే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వంలో దేవినేని ఉమ జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంగా వినియోగించారు. వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంగా వినియోగించారు. ప్రస్తుతం అదే కార్యాలయం పవన్ క్యాంప్ కార్యాలయంగా మారే అవకాశం ఉంది. కార్యాలయం పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం సచివాలయంకు వెళ్లి తనకు కేటాయించిన బ్లాక్ ను పవన్ పరిశీలిస్తారు.

Also Read : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషిలో మార్పు వచ్చిందా?

పవన్ కల్యాణ్ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ కు మానవహారంతో పూలుచల్లి స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ ను పరిశీలించిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు