చెలరేగిన పూరన్.. అఫ్గానిస్తాన్‌పై వెస్టిండీస్ భారీ విజయం

అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

WI vs AFG: టీ20 ప్రపంచకప్ లో భాగంగా అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ ప్రపంచకప్‌లో ఇదే హయ్యస్ట్ టీమ్ టోటల్ కావడం విశేషం.

నికోలస్ పూరన్ చెలరేగి ఆడడంతో విండీస్ భారీ స్కోరు చేసింది. పూరన్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి.. సెంచరీకి 2 పరుగుల దూరంలో రనౌటయ్యాడు. చార్లెస్ 43, షాయ్ హోప్ 25, రోవ్మాన్ పావెల్ 26 పరుగులు చేశారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో గుల్బాదిన్ 2 వికెట్లు తీశాడు.

216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ 38, అజ్మతుల్లా ఒమర్జాయ్ 23 మాత్రమే రాణించారు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్కాయ్ 3 వికెట్లు పడగొట్టాడు. అకేల్ హోసేన్, గుడాకేష్ మోతీ రెండేసి వికెట్లు తీశారు.

Also Read: టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పిన కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూస‌న్‌.. వీడియో వైర‌ల్

ట్రెండింగ్ వార్తలు