Sonakshi Sinha : బాలీవుడ్ భామ పెళ్లి డేట్ ఫిక్స్.. బ్యాచిలర్ పార్టీ ఫోటోలు వైరల్..

గత కొన్ని రోజులుగా సోనాక్షి సిన్హా బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బల్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.

Sonakshi Sinha – Zaheer Iqbal : బాలీవుడ్ స్టార్ శత్రుఘ్ను సిన్హా కూతురిగా సోనాక్షి సిన్హా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా దబాంగ్ తోనే భారీ హిట్ కొట్టి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగానే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా సోనాక్షి సిన్హా బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బల్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. గతంలో జహీర్ ఇక్బల్, సోనాక్షి సిన్హా కలిసి డబల్ XL సినిమాలో నటించారు.

Also Read : Alia Bhatt : రచయితగా మారిన స్టార్ హీరోయిన్.. పిల్లల కోసం ఫస్ట్ బుక్ రిలీజ్ చేసి..

ఆ సినిమా నుంచి పరిచయం అయిన ఈ ఇద్దరూ తర్వాత ప్రేమికులుగా మారారారని బాలీవుడ్ సమాచారం. ఇప్పటికే పలుమార్లు జహీర్ ఇక్బల్ సోనాక్షి సిన్హా తో క్లోజ్ గా దిగిన ఫోటోలు పోస్ట్ చేసాడు. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి జరగబోతుందని వార్తలు రాగా ఇప్పుడు పెళ్ళి డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తుంది. సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బల్ జూన్ 23న పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చేసుకొని రిసెప్షన్ గ్రాండ్ గా బాలీవుడ్ అందర్నీ పిలిచి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

తాజాగా సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బల్ ఇద్దరూ తమ ఫ్రెండ్స్ తో బ్యాచిలర్ పార్టీలు చేసుకున్నారు. తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో ఈ ఇద్దరూ తమ బ్యాచిలర్ పార్టీల ఫోటోలు షేర్ చేశారు. దీంతో సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బల్ బ్యాచిలర్ ఫోటోలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు