Surekhavani : సురేఖవాణికి మళ్ళీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు.. ఇలాంటి అబ్బాయి కావాలని సురేఖ..

నిఖిల్.. ఇద్దరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగగా ఇద్దరూ నో చెప్పి, మాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు కానీ మాకు బాయ్ ఫ్రెండ్స్ కావాలి అని చెప్పారు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలని సురేఖని అడగగా సురేఖ...........

Surekhavani :  ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, రీల్స్, డ్యాన్సులు పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వీరిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. సురేఖ వాణి ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క కూతురితో కలిసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. తాజాగా వీరిద్దరూ కలిసి యూట్యూబర్ నిఖిల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

ఈ ఇంటర్వ్యూలో నిఖిల్.. సురేఖవాణి మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అని అడగగా సురేఖ నో చెప్తే సుప్రీత ఎస్ చెప్పింది. అయితే సురేఖ దీనికి సమాధానమిస్తూ. తను నన్ను పెళ్లి చేసుకోమంటుంది, నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి అని ఇండైరెక్ట్ గా కూతురు కోసం పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.

అలాగే నిఖిల్.. ఇద్దరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగగా ఇద్దరూ నో చెప్పి, మాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు కానీ మాకు బాయ్ ఫ్రెండ్స్ కావాలి అని చెప్పారు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలని సురేఖని అడగగా సురేఖ.. నన్ను మంచిగా అర్ధం చేసుకోవాలి, మంచి హైట్ ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, లైట్‌గా గెడ్డం ఉండాలి, బాగా డబ్బులు ఉండాలి అని చెప్పింది. అయితే వెంటనే సుప్రిత.. కెమెరా వైపు చూస్తూ.. మీకు ఇవేమీ లేవు కదా సార్ అని చెప్పడంతో సురేఖ షాక్ అయింది. నిఖిల్.. అయితే ఎవరో ఉన్నారు, ఆ సర్ ఎవరో చెప్పండి అని అడిగాడు కానీ చెప్పలేదు ఇద్దరూ.

Meghana- Pavan Tej Engagement : మేఘన-పవన్ తేజ్ నిశితార్థం ఫొటోలు

దీంతో సురేఖ త్వరలో ఎవర్నో పెళ్లి చేసుకోబోతుంది అని మాత్రం క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. సురేఖ, సుప్రీత ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చి ఇందులో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడటంతో ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు