Liger: “పూరీ-డిస్ట్రిబ్యూటర్”ల వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి..

పూరీజగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం "లైగర్". పూరీ కనెక్టస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపరిహారం చెల్లించాలంటూ ధర్నాకు..

Liger: పూరీజగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లైగర్”. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోవడంలో విఫలమయ్యింది. విజయ్ ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించగా, రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది.

Puri Jagannadh : పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న బయ్యర్స్

పూరీ కనెక్టస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపరిహారం చెల్లించాలంటూ దర్శకనిర్మాత పూరీని కోరారు. పూరీజగన్ కూడా కొంతవరకు ఇస్తా అని చెప్పినా.. ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగుతామంటూ పూరీని బెదిరించడంతో, దర్శకుడు అసలు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పేశాడు.

ఈ వివాదంపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి స్పందించాడు.. “చట్టప్రకారంగా పూరీజగన్ నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక నిర్మాత తన సినిమాకి ఒక రేటుని నిర్ణయించి మార్కెట్ లోకి తీసుకు వచ్చాకా.. ఆ రేటు నచ్చితే కొనడం, కొనకపోవడం డిస్ట్రిబ్యూటర్ల ఇష్టం. ఆ సినిమాలో నటించిన హీరో మునపటి సినిమా మార్కెట్ ని చూసి కొనుగోలు చేయకపోవడం ఎగ్జిబిటర్ల తప్పు” అంటూ వ్యాఖ్యానించాడు.

 

ట్రెండింగ్ వార్తలు