UnStoppable Trailer : ఈ సారి మరింత రంజుగా.. అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్..

ఇటీవల బాలయ్య హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 2ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. విజయవాడలో ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సారి సినీ సెలబ్రిటీలతోనే కాక రాజకీయ నాయకులని కూడా.........

UnStoppable Trailer :  బాలయ్య బాబు ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో యాంకర్ గా అందర్నీ అలరించి ఆశ్చర్యపరిచారు. ఆయన అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులందరికీ ఈ షో తెగ నచ్చేసింది. సినీ స్టార్ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్లందరితో సరదగా షోని తనదైన శైలిలో నడిపించారు బాలకృష్ణ. ఈ షో భారీ విజయం సాధించి పలు రికార్డులని కూడా క్రియేట్ చేసింది. దీంతో గతంలోనే సీజన్ 2 ఉందని తెలిపారు ఆహా నిర్వాహకులు.

ఇటీవల బాలయ్య హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 2ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. విజయవాడలో ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సారి సినీ సెలబ్రిటీలతోనే కాక రాజకీయ నాయకులని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో ఉండబోతున్నట్టు తెలియడంతో తెలుగు ప్రేక్షకులంతా దీనికోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఇంట్రడక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Shannu-Deepu : బ్రేకప్ తర్వాత ఫస్ట్ టైం కలిసిన షన్ను-దీపు.. దీప్తి సునైనా గురించి గొప్పగా మాట్లాడిన షణ్ముఖ్..

ఈ ట్రైలర్ ని ఆసక్తిగా చిత్రీకరించారు. షో గురించి చూపించకుండా జాగ్రత్త పడ్డారు. ఒక నిధి కోసం బాలయ్య బాబు వెతికినట్టు, ఎన్నో అవరోధాలని దాటుకొని ఆ నిధిలో ఉన్న కత్తిని బాలయ్య చేజిక్కించుకున్నట్టు ఈ ట్రైలర్ లో చూపించారు. ఆ కత్తితో షోలోకి ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెప్పించారు. ప్రశ్నల్లో మరింత ఫెయిర్, ఆటల్లో మరింత డేర్, సరదాల్లో మరింత సెటైర్.. మీ కోసం మరింత రంజుగా.. అన్‌స్టాపబుల్ అని బాలయ్యతో పవర్ ఫుల్ గా చెప్పించారు. దీంతో ఈ ట్రైలర్ వైరల్ గా మారింది. మొదటి ఎపిసోడ్ ని అక్టోబర్ 14న రిలీజ్ చేయనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు