Vijay Devarakonda: డ్యాన్స్ అంటే ఏడుపే అంటోన్న లైగర్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తుండటంతో లైగర్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్‌లో లైగర్ టీమ్ ప్రెస్ మీట్‌లో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండేలు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.

Vijay Devarkonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తుండటంతో లైగర్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.

Liger fandom tour : వరంగల్ లో లైగర్ ఫ్యాన్ డం టూర్ సెలబ్రేషన్స్

ఇటీవల వరంగల్‌లో ఫ్యాన్‌డమ్ టూర్ నిర్వహించిన లైగర్ టీమ్, తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌లో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండేలు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి చూపులు సినిమా నుంచి తనను ప్రేమిస్తూ వస్తున్నారని.. ఇఫ్పుడు ఇండియావైడ్‌గా ఆ ప్రేమ కనిపిస్తుందని విజయ్ అన్నాడు. ప్రేక్షకులందరూ మెచ్చే సినిమాను తాము అందిస్తున్నామని.. ఇది పక్కా తెలుగు సినిమా అని.. హిందీ, తెలుగులో షూట్ చేశామని.. ఇతర ప్రాంతాల్లో కూడా మంచి ఆదరణ చూపిస్తున్నారని విజయ్ అన్నాడు.

ఇక తాను యాక్టర్ అవుదామని ఆడిషన్స్ కోసం కొన్ని ఆఫీస్‌లకు తిరిగానని.. తేజ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశానని.. డియర్ కామ్రేడ్ తరువాత పూరీ గారిని కలిశానని.. అందరి ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా అందుకుంటుందని విజయ్ తెలిపాడు. జనం థియేటర్స్‌కు వస్తే సినిమాని ప్రేక్షకులు అస్సలు వదలరని.. తాను సెంటిమెంట్‌ను అసలు నమ్మనని.. ఈ సినిమాకి తనలో ఎంత ఎనర్జీ వుందో అంత ఇచ్చేశానని చెప్పుకొచ్చాడు విజయ్. ఇక పూరీ గారి కంటెంట్‌తో ఆడుకోవచ్చని.. తనకు డాన్స్ అంటే ఏడుపు వస్తుందని.. ఒకసారి చెయ్యాలి అంటే ఏదో కిందా మీద పడి చేస్తానని విజయ్ తెలిపాడు.

Liger: ఊరమాస్ ట్రీట్‌గా లైగర్ కోకా 2.0 పాట!

తాను యాక్టర్ అవ్వనప్పుడే తన ఆంటీలు ట్రోల్ చేసేవారని.. అలాంటివి అన్నీ అలవాటు అయిపోయాయని విజయ్ అన్నాడు. మైక్ టైసన్‌ను తొలుత చూస్తే భయమేసిందని.. ఆయన చాలా ఫాస్ట్‌గా వుంటాడని.. ఆయనతో వర్క్ చేయడం మజా వచ్చిందని విజయ్ అన్నాడు. కరణ్ జోహార్‌కి యాక్టర్‌గా తాను నచ్చానని.. తన ట్రైలర్ లాంచ్‌కి అంతమంది వచ్చి తనను అభిమానిస్తుంటే షాక్ అయ్యానని.. తన వాళ్ళు ఎవరో వాళ్లకు తెలీదు కానీ, తనను అంతలా అదిరించారని.. మహేష్ సార్ అంటే తనకి లవ్ అని..
పూరీ-మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి తన ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమా అని విజయ్ అన్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండకు లైగర్ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని రౌడీ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు