Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్‌జేడీకి జాక్‌పాట్!

బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్‌జేడీకి కలిసొస్తోంది. ఆర్‌జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.

Bihar Deputy CM: బీజేపీతో పొత్తుకు స్వస్తి చెప్పిన బిహార్ సీఎం నితీష్ కుమార్.. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజే నితీష్ ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ‘మహాఘాత్ బంధన్’ పేరుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. వామపక్షాలు కూడా ఈ కూటమిలో చేరుతున్నాయి.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో అందరికంటే ఎక్కువ లాభపడుతోంది మాత్రం ఆర్‌జేడీనే. నిన్నటివరకు ప్రతిపక్షంగా ఉన్న ఆర్‌జేడీ ఈ రోజు నుంచి అధికార పార్టీగా మారబోతుంది. ఈ పార్టీలో కీలక నేతగా ఉన్న తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కబోతున్నట్లు సమాచారం. అలాగే 20 మంత్రి పదవులు కూడా దక్కే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. మొత్తం 35 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతుండగా, అందులో 20 వరకు పదవులు ఆర్‌జేడీకే కేటాయించబోతున్నారు. గత క్యాబినెట్‌లో తమ పార్టీ జేడీ (యూ) తరఫున మంత్రులుగా ఉన్న వారినే ఈసారి కూడా నితీష్ కొనసాగించబోతున్నారు. అంటే ఆ పార్టీకి 11-13 వరకు మంత్రి పదవులు దక్కొచ్చు. మరో నాలుగు పదవులు కాంగ్రెస్‌కు కేటాయిస్తారు. ఒకటి లేదా రెండు పదవులు ఇతరులకు కేటాయిస్తారు.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

పదవుల కేటాయింపుల్లో చివరి నిమిషంలో స్వల్ప సర్దుబాట్లు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత కూటమిలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ఆర్‌జేడీనే. మొత్తం 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో ఆర్‌జేడీకి అత్యధికంగా 79 ఎమ్మెల్యే సీట్లున్నాయి. బీజేపీతో పోలిస్తే రెండు సీట్లు ఎక్కువ. అందువల్ల ఆర్‌జేడీకి ఎక్కువ మంత్రి పదవులు కేటాయించడం న్యాయంగానే ఉంటుందని విశ్లేషకుల అంచనా. కీలకమైన ఫైనాన్స్, హోం మంత్రిత్వ శాఖలు కూడా ఆ పార్టీకే దక్కే అవకాశాలున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు