Non-bailable warrant against Nithyananda: ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆయన 2019 నుంచి విచారణకు రాకపోవడంతో బెంగళూరులోని రామనగర అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వచ్చే నెల 23లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

Non-bailable warrant against Nithyananda: ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆయన 2019 నుంచి విచారణకు రాకపోవడంతో బెంగళూరులోని రామనగర అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వచ్చే నెల 23లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

నిత్యానంద ‘కైలాసం’ పేరిట ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేసుకుని ఉంటున్నట్లు గతంతో ప్రచారం జరిగింది. రహస్య ప్రాంతం నుంచి నిత్యానంద మాట్లాడిన వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తాను ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి ఉంటున్నానని నిత్యానంద అన్నారు. దానికే కైలాసం అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, ఆయన తమ దేశంలో లేరని ఈక్వెడార్‌ ప్రభుత్వం పేర్కొంది.

విచారణకు హాజరు కావాలని గతంలోనూ ఆయనకు బెంగళూరులోని కోర్టు వారెంట్‌ జారీ చేయగా, ఆయన ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. గతంలో నిత్యానంద స్వామి అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత భారత్ విడిచి పారిపోయారు. దీంతో నిత్యానంద బెయిల్‌ను న్యాయస్థానం 2020లో రద్దు చేసింది.

Russia-Ukraine war: రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం ప్రకటించిన అమెరికా

ట్రెండింగ్ వార్తలు