Viral Video: మాస్క్ పెట్టుకునే గంగాజలం తాగిన రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్

కొవిడ్-19 సమయం నుంచి మాస్క్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అప్పటికి మాస్క్ అంటే ఆసుపత్రుల్లో మాత్రమే కనిపించేది. కానీ కొవిడ్ మహమ్మారి అనంతరం దేశంలో ఒక్కసారైనా మాస్క్ ధరించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా విస్తృతమైన ఈ మాస్క్.. నేటికి చాలా మందికి కనిపిస్తూనే ఉంటుంది

Viral Video: రాజస్తాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా రాష్ట్రంలోని జైసల్మేర్‭లోని ఒక గుడికి వెళ్లిన ఆయన.. చరణామృతాన్ని (గంగాజలం) మాస్క్ తీయకుండానే తాగి ట్రోల్స్‭లో ఇరుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ నెటిజెన్లు జోకులు వస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ గెహ్లోత్‭పై జోకులు వేసుకుంటున్నారు.

కొవిడ్-19 సమయం నుంచి మాస్క్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అప్పటికి మాస్క్ అంటే ఆసుపత్రుల్లో మాత్రమే కనిపించేది. కానీ కొవిడ్ మహమ్మారి అనంతరం దేశంలో ఒక్కసారైనా మాస్క్ ధరించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా విస్తృతమైన ఈ మాస్క్.. నేటికి చాలా మందికి కనిపిస్తూనే ఉంటుంది. మాస్క్ ధరించాలని కఠిన నిబంధనలు పెట్టిన సమయంలో బయట ఏదైనా తినాలంటే ఏంటి పరిస్థితి? మాస్క్ పెట్టుకుని ఎలా తినాలంటూ నెటిజెన్లు అప్పట్లో కొన్ని జోకులు సైతం వేసుకున్నారు. కాగా, తాజాగా మాస్క్ తీయకుండానే గంగాజలం తాగి బహుశా అప్పటి గందరగోళ ప్రశ్నలకు గెహ్లోత్ సమాధానం చెప్పారనుకోవచ్చు.

Viral Video: రేషన్ తీసుకోవడానికి మెర్సిడెస్ జెంజ్‭లో వచ్చిన ‘పేదవాడు’

ట్రెండింగ్ వార్తలు