Uttar Pradesh: వీధి కుక్కల భీకర దాడి.. తీవ్రగాయాలతో 11 ఏళ్ల బాలుడి మృతి

బాలుడి ముఖం, కుడి చేతిని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

Uttar Pradesh: ఓ బాలుడిపై వీధి కుక్కలు (Stray Dogs) భీకరంగా దాడి చేసి చంపాయి. ఆ బాలుడి ముఖం, చేతిని కుక్కలు కొరికేసినట్లు పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్, శాస్త్రి నగర్ ఇంటర్మీడియట్ గ్రౌండ్ లో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. 11 ఏళ్ల బాలుడు ఆదర్శ్ నిన్న ఉదయం 11 గంటలకు మార్కెట్ కు వెళ్లాడని పోలీసులు తెలిపారు.

చాలాసేపటివరకు తిరిగి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని అన్నారు. ఆదర్శ్ కోసం పలు ప్రాంతాల్లో వెతికారని, చివరకు నిన్న రాత్రి ఆ బాలుడు విగత జీవిగా ఓ చోట పడి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారని తెలిపారు. ఆ బాలుడి ముఖం, కుడి చేతిపై తీవ్రగాయాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. వీధి కుక్కల దాడి నుంచి బాలుడు తనను తాను రక్షించుకోవడానికి పోరాడినా అతడి ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోందని వివరించారు.

వీధి కుక్కలే అతడిపై దాడి చేసి, చంపాయని నిర్ధారణకు వచ్చినట్లు ఇన్‌స్పెక్టర్‌ కొత్వాలీ రవి రాయ్ తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు. పిల్లలపై వీధి కుక్కలు దాడులు జరుపుతున్న ఘటనలు పతి రోజు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణలోనూ ఇటువంటి ఘటనలు పెరిగిపోయాయి.

experts warning : ప్రెగ్నెంట్ లేడీస్ జుట్టుకి రంగు వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా…

ట్రెండింగ్ వార్తలు