Viral Video : షాకింగ్.. తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన టూరిస్టుపై కర్రలు, రాడ్లతో దాడి.. వదిలేయమని ప్రాథేయపడినా దారుణంగా కొట్టారు

కర్రలు, రాడ్ల తీసుకొచ్చి ఆ వ్యక్తిపై దాడి చేశారు. వీధుల్లో పరిగెత్తించి మరీ కొట్టారు. తనను కొట్టొద్దని పాపం అతడు..(Viral Video)

Agra Tourist Beaten(Photo : Google)

Agra Tourist Beaten – Viral Video : దేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. రౌడీలు, గూండాలు బరితెగిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే దాడులకు తెగబడుతున్నారు. అకారణంగా ఘర్షణలకు దిగుతున్నారు. ఐదారు మంది గుంపుగా చేరి కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడుతున్నారు. అత్యంత దారుణంగా కొడుతున్నారు. తాజాగా ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆగ్రాలో దారుణం జరిగింది. ఓ టూరిస్టును కొందరు యువకులు అత్యంత దారుణంగా కొట్టారు. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్ మహల్ చూసేందుకు కారులో ఆగ్రాకి వెళ్లాడు. అయితే రోడ్డుపై వెళ్తుండగా.. అతడి కారు ఓ యువకుడిని తాకింది. అంతే, అతడితో పాటు ఉన్న యువకులు రెచ్చిపోయారు. ఆ వ్యక్తితో గొడవకు దిగారు. చూస్తుండగానే కర్రలు, రాడ్ల తీసుకొచ్చి ఆ వ్యక్తిపై దాడి చేశారు. వీధుల్లో పరిగెత్తించి మరీ కొట్టారు.(Viral Video)

Also Read..Dalit Girl Gang-Raped : దళిత బాలికపై ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్.. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకం

వారి నుంచి తప్పించుకునేందుకు, తన ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితుడు ఓ స్వీట్ షాపులోకి దూరాడు. అయినా అల్లరిమూక వదల్లేదు. షాపులోకి చొరబడి మరీ దారుణంగా కొట్టారు. తప్పు జరిగిపోయిందని, తనను క్షమించాలని బాధితుడు వారిని చేతులు జోడించి మరీ వేడుకున్నాడు. తనను కొట్టొద్దని పాపం అతడు ఎంతగానో ప్రాథేయపడ్డాడు. అయినా వాళ్లు అస్సలు కనికరం చూపలేదు. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా చాలాసేపు కొడుతూనే ఉన్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అల్లరిమూకను అడ్డుకునే సాహసం కూడా చెయ్యలేకపోయారు.

టూరిస్టును యువకులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో అందరినీ షాక్ కి గురి చేసింది. మరీ ఇంత దారుణమా? అని నివ్వెరపోతున్నారు. అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను డిమాండ్ చేశారు.(Viral Video)

Also Read..Experts Warn Game Addiction : పిల్లల్లో గేమింగ్ వ్యసనం.. పేరంట్స్ ఇంటర్నెట్ ఆపేస్తే.. Wi-Fi కోసం రాత్రిళ్లూ ఇళ్లలో నుంచి పారిపోతున్నారు..!

వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. వీడియో ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని గుర్తించారు. వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రా పోలీసులు చాలా బాగా పని చేశారని కితాబిస్తున్నారు. ఇలాంటి చర్యలతో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు