Tigers : పక్కా ప్లాన్‌తో పులుల్ని చంపి ప్రతీకారం తీర్చుకున్న రైతు .. ఎందుకంటే

రైతు అంటే కష్టపడి పంటలు పడిస్తాడు. కానీ ఓ రైతు మాత్రం పులిపై పగపట్టాడు. పక్కా ప్లాన్ వేసి అంతమొందించాడు. పులులపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

tamil nadu  Tigers

tamil nadu  Tigers : పులుల్ని పక్కా ప్లాన్‌తో అంతమొందించాడు ఓ రైతు. ఓ పులిపై పగతో రగిలిపోయిన తమిళనాడుకు చెందిన ఓ రైతు వేసిన ప్లానుకు రెండు పులులు చనిపోయాయి. నీలగిరి అడవుల్లో జరిగిన ఈ ఘటనపై అనుమానం రావటంతో అటవీశాఖ అధికారులు దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది.

తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని అడవుల్లో కుందా ప్రాంతంలో అవలాంచ్ డ్యామ్ వద్ద నీటికుంటలో రెండు పులులు చనిపోయి పడుతున్నాయి. వాటి వరస్సు ఒకదానికి మూడేళ్లు, మరొకటి ఎనిమిదేళ్ల పులి. చచ్చిపడుతున్న ఆ రెండు పులులకు కాస్త దూరంగా ఆవు కళేబరం కనిపించింది. దీంతో ఆ మూడింటి నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపించారు.వాటిపై పరీక్షలు చేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు ఆవు కళేబరంపై పురుగుమందులు ఉన్నాయని పులుల కళేబరంలో కూడా వాటి ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారుల అనుమానం బలపడింది. ఎవరో కావాలనే ఆవు కళేబరానికి పురుగుల మందు పూసి పులుల్ని చంపినట్లుగా అనుమానించారు.

TigTigers Die : ఏడు రోజుల్లో 7 పులులు, 5 పులికూనల మృతిers Die : ఏడు రోజుల్లో 7 పులులు, 5 పులికూనల మృతి

ఆ ఆవు యజమాని ఎవరో ఆరా తీశారు. అతని ఆవు గత కొన్ని రోజులుగా కనిపించటంలేదని తెలుసుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు ఆవు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆవు యజమానికి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం చెప్పాడు రైతు. తన ఆవు కొన్ని రోజులుగా కనిపించలేదు.వెదుకుతు వచ్చిన తనకు ఆవు కళేబరం అడవిలో కనిపించిందని..ఆవును పులి చంపినట్లుగా గుర్తించానని..తన ఆవును పొట్టనపెట్టుకున్న పులిని చంపాలని ఆవు కళేబరానికి పురుగులు మందులు పూశానని తెలిపాడు. పోలీసులు ఆవు యజమానిని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేశారు.

సదరు ఆవు యజమానికిపై అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం, జంతుహింస చట్టం కింద కేసులు నమోదు చేశారు. ముడుమలై టైగర్ రిజర్వ్‌లో ఇటీవల పులులు చనిపోవటం కలకలం సృష్టిస్తోంది. పులులు చనిపోవటంతో విచారణ జరపుతుంన్నామని ..ఈ క్రమంలో అనుమానాస్పదంగా రెండు పులులు చనిపోవటంతో ఆరా తీయగా ఆవు యజమానిపై అనుమానంతో ఫిర్యాదు చేయగా అసలు విషయం తెలిసిందని తెలిపారు.ముడమలై టైగర్ రిజర్వ్ లో పులులు చనిపోతున్న విషయంపై స్మగ్లింగ్ వంటి కోణాలతో సహా అన్ని కోణాల్లోను విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు