Telangana Congress: బీజేపీలోని ఐదుగురు ముఖ్యనేతలపై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ!

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ దూకుడు పెంచుతోంది కాంగ్రెస్. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్‌ వల విసురుతోంది. రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ బీజేపీ అసంతృప్త నేతలకు ఆఫర్లు ఇస్తోంది హస్తం పార్టీ.

telangana congress party operation akarsh target bjp leaders

Telangana Congress Party: అధికారమే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలపై గాలం వేస్తోంది. కొద్దినెలల ముందు స్టార్ట్ చేసిన ఆపరేషన్ (Operation Akarsh) ఆకర్ష్‌లో కొంతమంది నేతలను పార్టీలో చేర్చుకోగా.. ఇప్పుడు బీజేపీలోని (BJP Telangana) ఐదు పెద్ద వికెట్లపై ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ.. కలమం పార్టీపై కినుక వహించిన నేతలను ఎంచుకుని స్నేహ హస్తం చాస్తోంది. తమ పార్టీలో చేరితే కోరిన సీటు ఇస్తామని వల వేస్తోంది. మరి కాంగ్రెస్ వలకు బీజేపీ నేతలు చిక్కారా?

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ దూకుడు పెంచుతోంది కాంగ్రెస్. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్‌ వల విసురుతోంది. రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ బీజేపీ అసంతృప్త నేతలకు ఆఫర్లు ఇస్తోంది హస్తం పార్టీ. ముందుగా ఐదుగురు ముఖ్యనేతలను కాంగ్రెస్‌లోకి లాగేయాలని తెగ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌లను సొంతగూటికి వచ్చేయమని కబుర్లు పంపింది. ఈ జాబితాలో బీజేపీ స్ట్రాంగ్ లీడర్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురు నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారని భావిస్తున్న కాంగ్రెస్.. ఆ ఐదుగురికి టిక్కెట్ భరోసా ఇస్తూ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా మాజీ ఎంపీ వివేక్ సోదరుడు వినోద్, రాజగోపాల్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కూడా వీరి రాకపై ఆసక్తితో ఉంది. వివేక్‌కు చెన్నూరు అసెంబ్లీ లేదా, పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు గాంధీభవన్ టాక్. ఇక రాజగోపాల్‌రెడ్డిని భువనగిరి ఎమ్మెల్యేగా బరిలో దింపాలని చూస్తోంది కాంగ్రెస్. అంతేకాదు రాజగోపాల్‌రెడ్డి కోసం ఆ సీటు ఆశిస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డిని వెయిటింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: తెలంగాణ కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ ఇదే..! 40 మందితో జాబితా సిద్ధం..! 10టీవీ ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్ట్‌

ముందుగా రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ను చేర్చుకున్న తర్వాత బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై ఫోకస్ పెట్టాలని చూస్తోంది కాంగ్రెస్. రఘునందన్ బీజేపీపై అసంతృప్తితో ఉన్నందున పార్టీలో చేర్చుకుని పటాన్‌చెరు స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిలతో కాంగ్రెస్ సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యెన్నం శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్ నగర్, ఏనుగు రవీందర్ రెడ్డికి ఎల్లారెడ్డి టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎల్లారెడ్డిలో కొన్ని ఇబ్బందులు ఉండటంతో ముందుగా వాటిని పరిష్కరించి ఆ తర్వాతే ఏనుగు రవీందర్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తోంది పీసీసీ నాయకత్వం.

Also Read: కోటి రూపాయల చెక్‌ను సాయిచంద్ భార్యకు అందజేసిన బీఆర్ఎస్ నేతలు

ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లోనే క్లియర్ చేయాలని చూస్తోందని గాంధీభవన్ టాక్. ఐతే కాంగ్రెస్ ఆఫర్లకు బీజేపీ నేతలు స్పందించారా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఆ పార్టీలో వారు అసంతృప్తిగా ఉన్నారన్న ఏకైక కారణంతోనే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసిందని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు