దశాబ్దంలో అద్భుతహ: సునీల్ చెత్రి 53, పీవీ సింధు 5, మేరీ కోమ్ 8

క్రీడా ప్రపంచంలో భారత పురోగతి రెట్టింపు అవుతోంది. ఈ దశాబ్దంలో భారత క్రీడా ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతుంది. ఈ మేర టీమిండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి 82 మ్యాచ్‌లలో 53గోల్స్ చేసి అదుర్స్ అనిపించాడు. యావరేజ్ 64.6శాతంతో దూసుకెళ్తున్న సునీల్.. ప్రతి మూడు మ్యాచ్ లలో రెండు గోల్స్ చేస్తున్నాడు. ఇంతే కాలంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కంటే బాగా రాణిస్తున్నాడు. మెస్సీ 94గేమ్‌లలో 57గోల్స్ చేసి 60.6 యావరేజితో ఉన్నాడు. రొనాల్డొ విషయానికొస్తే 96మ్యాచ్‌లకు 77చేసి టాప్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 

 

పీవి సింధు
వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవి సింధు 5 పతకాలు సాధించింది. దశాబ్దం మొత్తంలో చైనాకు చెందిన జాంగ్ నింగ్ తర్వాత 5వ్యక్తిగత పతకాలు సాధించిన ప్లేయర్‌గా ఆమే నిలిచింది. 2019 ప్రపంచ చాంపియన్ స్వర్ణం దక్కించుకోవడంతో పాటు 2107, 2018లలో సిల్వర్, 2013, 2014లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించింది. ప్రపంచంలో సింధుతో సమంగా దక్షిణ కొరియా, డెన్మార్క్ కు చెందిన ప్లేయర్లు సాధించినా ఇండోనేషియా, చైనా ప్లేయర్లు మనకంటే ముందువరుసలో ఉన్నారు. 

 

మేరీ కోమ్
పెళ్లి అయి సెకండ్ ఇన్నింగ్స్ పిల్లల పెంపకంలో గడపాల్సిన ఆమె మళ్లీ బాక్సింగ్ బరిలోకి దిగింది. 2019లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ కాంస్యాన్ని దక్కించుకుంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్ ఈ దశాబ్దంలో రెండు స్వర్ణాలను సాధించింది. జరిగిన 11ఎడిషన్లలో కేవలం మూడు సార్లు మాత్రమే ఆమె పతకం దక్కించుకోలేదు. ఇందులో 5 స్వర్ణాలు ఉన్నాయి. ఓ బిడ్డకు జన్మనిచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమె 2014 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలచిన తొలి మహిళగా నిలిచారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ తొలి బాక్సర్ గానూ నిలిచారు. 

 

దీపాకర్మాకర్ 
52 సంవత్సరాలలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్. కేవలం 0.150పాయింట్ల వ్యత్యాసంతో 2016 రియో ఒలింపిక్స్‌లో పోడియం మిస్ చేసుకుంది.  

 

15పతకాలతో భారత్:
ఈ దశాబ్దంలో భారత్ ఆసియా గేమ్స్‌లో 41స్వర్ణ పతకాలు సాధించింది. వీటిలో అథ్లెటిక్స్ నుంచే 15వచ్చాయి. కబడ్డీ, బాక్సింగ్, షూటింగ్, టెన్నిస్ లలో ఒక్కో దానిలో 4స్వర్ణాలు వచ్చి చేరాయి. రెజ్లింగ్‌లో భారత్ మూడు స్వర్ణాలు రాగా, రోయింగ్‌లో 2, ఆర్చరీ, బ్రిడ్జ్, క్యూ స్పోర్ట్స్, హాకీ, స్క్వాష్ లలో తలో ఒకటి వచ్చి చేరాయి. 
 

 

ట్రెండింగ్ వార్తలు