Virat Kohli : ఇదీ చూశారా.. 8 ఏళ్ల త‌రువాత విరాట్ కోహ్లీ బౌలింగ్‌.. సూపరో సూపర్.. వీడియో వైర‌ల్‌

పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి కొత్త‌గా చెప్పేది ఏం లేదు. త‌న బ్యాటింగ్‌తో ఎన్నో వేల ప‌రుగులు సాధించాడు.

Virat Kohli bowling

Virat Kohli bowling : పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి కొత్త‌గా చెప్పేది ఏం లేదు. త‌న బ్యాటింగ్‌తో ఎన్నో వేల ప‌రుగులు సాధించాడు. ఎన్నో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. చాలా మందికి విరాట్ కోహ్లీ ఓ బ్యాట‌ర్‌గా మాత్ర‌మే తెలుసు. అత‌డు బౌలింగ్ చేస్తాడు అన్న సంగ‌తి తెలియ‌దు. కెరీర్ ఆరంభంలో అడ‌పాడ‌ద‌పా కోహ్లీ బౌలింగ్ చేశాడు. కెప్టెన్ అయిన త‌రువాత దాదాపుగా బౌలింగ్ చేయ‌లేదు. అయితే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా పూణే వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అనివార్య ప‌రిస్థితుల్లో కోహ్లీ బంతిని అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్‌ మొద‌ట బౌలింగ్ చేస్తోంది. అయితే.. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవ‌ర్‌ను హార్దిక్ పాండ్య వేశాడు. ఈ ఓవ‌ర్‌లో మూడో బంతిని బంగ్లా బ్యాట‌ర్ లిట‌న్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. బంతిని ఆప‌బోయిన హార్దిక్ పాండ్య జారి ప‌డ్డాడు. దీంతో అత‌డి ఎడ‌మ కాలుకు గాయ‌మైంది. హార్దిక్ నొప్పితో విల‌విల‌లాడాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి ప్ర‌థ‌మ చికిత్స అందించాడు.

8 ఏళ్ల త‌రువాత కోహ్లీ బౌలింగ్‌..

అయిన‌ప్ప‌టికీ హార్దిక్ లేచి నిలుచునేందుకు సైతం ఇబ్బంది ప‌డ‌డంతో మైదానం బ‌య‌ట‌కు వెళ్లాడు. దీంతో ఆ ఓవ‌ర్‌లో మిగిలిన మూడు బంతుల‌ను విరాట్ కోహ్లీ వేశాడు. మూడు బంతుల్లో కోహ్లీ రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ కోహ్లీ దాదాపు ఎనిమిదేళ్ల త‌రువాత బౌలింగ్ చేశాడు. ఆఖ‌రి సారి అత‌డు 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సిడ్ని వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఒక ఓవ‌ర్ వేశాడు. అప్పుడు ఏడు ప‌రుగులు ఇచ్చాడు.

ODI World Cup 2023 : నువ్వు ఇలా అంటావ‌ని అనుకోలేదు.. బాబ‌ర్ కెప్టెన్సీపై ర‌గ‌డ‌.. మాలిక్‌ పై మండిప‌డ్డ యూస‌ఫ్

కాగా.. విరాట్ కోహ్లీ బౌలింగ్ వేస్తున్న వీడియో, ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇక హార్దిక్ కు అయిన గాయం తీవ్ర‌త‌ను తెలుసుకునేందుకు అత‌డిని స్కానింగ్‌కు పంపిన‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. ఒక‌వేళ గాయం తీవ్ర‌మైన‌ది అయితే మాత్రం టీమ్ఇండియాకు క‌ష్టాలు త‌ప్ప‌వు. ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచుల్లో అత‌డు ఆడ‌కుంటే దాదాపు 12 ఏళ్ల త‌రువాత ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడాల‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు టీమ్ఇండియా ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

ODI World Cup 2023 : ల‌క్నో స్టేడియంలో ఆస్ట్రేలియా అభిమాని.. గణపతి బప్పా మోరియా, భారత్ మాతా కీ జై.. వీడియో వైర‌ల్‌

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 25 ఓవ‌ర్లు ముగిసే స‌రికి మూడు వికెట్లు కోల్పోయిన 131 ప‌రుగులు చేసింది. లిట‌న్ దాస్ (64), తౌహిద్ హృదయ్ (1) లు ఆడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు