Love Is In The Air _ Argentine Athlete Couple Steals ( Image Source : Google )
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ ఓ ప్రేమజంటకు వేదికగా మారింది. ఇద్దరు అర్జెంటీనా అథ్లెట్ల లవ్ ప్రపోజల్‌తో ఈ మెగా టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటకు సంబంధించిన ఫొటోను ఒలంపిక్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Manu Bhaker Biography: దేశం గర్వపడేలా చేసిన మను భాకర్.. అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు ఆమెను ఇలా..
పారిస్ 2024 ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభోత్సవం సందర్భంగా అనేక మంది అథ్లెట్లు పారిస్‌లో గుమిగూడారు. ఒక అథ్లెట్ తన తోటి అథ్లెట్‌కు అందరి ముందు ప్రపోజ్ చేసి ఒలింపిక్ గేమ్ ప్రారంభించాడు. ఈ మధురమైన క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాబ్లో సిమోనెట్, పిలార్ కాంపోయ్ మధ్య ప్రేమ కథను @TheOlympicGames అకౌంట్ ద్వారా ట్విట్టర్లో జూలై 24న షేర్ చేసింది. పారిస్ 2024 ఒలింపిక్ విలేజ్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ పోస్టుకు ప్రపోజల్ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయగా 106.5 వేల వ్యూస్, 665 లైక్‌లు వచ్చాయి.
The first marriage proposal at the #Paris2024 Olympic Village! 💍🩵🤍
Pablo Simonet and Pilar Campoy had a very special moment surrounded by their handball and hockey teammates from Argentina. 😍
Congratulations, you two! All the best! 👏 pic.twitter.com/hJJyf9lBMI
— The Olympic Games (@Olympics) July 24, 2024
పాబ్లో, పిలార్ల లవ్ స్టోరీ.. పారిస్ 2024 ఒలింపిక్స్ చిరస్మరణీయమైన క్షణంగా నిలిచింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు లవ్ బర్డ్స్‌ను అభినందించారు. ప్రేమ గాలిలో ఉందని మరో నెటిజన్ కామెంట్ చేయగా, ప్రేమ జంటకు అభినందనలు అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఒలింపిక్ రింగ్‌లు, ఎంగేజ్మెంట్ రింగ్‌లు ఒకేచోట అంటూ మరో యూజర్ పోస్టు పెట్టాడు. ఈ లవ్ ప్రపోజల్ వీడియోను పాబ్లో సిమోనెట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశారు. ఈ అథ్లెట్ జంట 2015 నుంచి డేటింగ్లో ఉన్నారు. 9 ఏళ్ల తమ లవ్ జెర్నీని ప్రపంచమంతా చాటిచెప్పేందుకు ఒలింపిక్స్ వేదికగా బహిర్గంతం చేసింది. పబ్‌లో మోకాలిపై కూర్చొని పిలర్కు ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే పిలర్ కూడా ఓకే అనేసింది. అంతే.. ఉంగరం తొడిగేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత జట్టు సభ్యులతో ఫొటోలు దిగారు.
Read Also : Olympics 2024 : మహిళల షూటింగ్లో మను బాకర్‌కు కాంస్యం