Paris Olympics Event : ఈ పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్‌లో పోటీపడనున్న బిల్‌ గేట్స్ అల్లుడు నయెల్ నాసర్!

Paris Olympics Event : ఈక్వెస్ట్రియన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కాదు. 2012 లండన్ సమ్మర్ ఒలింపిక్స్‌లో ఈజిప్ట్‌కు కూడా నాసర్ ప్రాతినిధ్యం వహించాడు. 2020లో టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించాడు.

Bill Gates’s son-in-law Nayel Nassar to compete ( Image Source : Google )

Bill Gates son-in-law Nayel Nassar : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ బిలియనీర్ బిల్ గేట్స్ అల్లుడు నాయెల్ నాసర్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఈజిప్ట్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్ అయిన నాసర్ ఈ ఏడాది ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్ జంపింగ్ ఈవెంట్‌లో పాల్గొనున్నాడు. 2024 సమ్మర్ ఒలింపిక్స్‌లోని ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లలో వ్యక్తిగత, జట్టు పోటీల్లో రెండింటికీ మొత్తం మూడు విభాగాలు (డ్రెస్సేజ్, ఈవెంట్‌లు, జంపింగ్) ఉన్నాయి. అందులో వ్యక్తిగత ఈక్వెస్ట్రియన్ జంపింగ్ ఈవెంట్‌లో నాజర్ పాల్గొంటాడు.

Read Also : Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో తొలి బంగారు ప‌త‌కం సాధించిన దేశం ఏదో తెలుసా..?

చిన్ననాటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి :
ఈక్వెస్ట్రియన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కాదు. 2012 లండన్ సమ్మర్ ఒలింపిక్స్‌లో ఈజిప్ట్‌కు కూడా నాసర్ ప్రాతినిధ్యం వహించాడు. 2020లో టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించాడు. చిన్నప్పటినుంచే గుర్రపు స్వారీ అంటే చాలా ఆసక్తి ఉండేది. కేవలం ఐదు ఏళ్ల వయస్సులోనే నాసర్ గుర్రాలను స్వారీ చేయడం మొదలుపెట్టాడు.

10 ఏళ్ల వయస్సు నుంచే జప్పింగ్ క్రీడలో శిక్షణ పొందాడు. 33 ఏళ్ల అమెరికన్-ఈజిప్షియన్ చికాగోలో పుట్టి కువైట్‌లో పెరిగాడు. ఆటల పట్ల ఆసక్తి కలిగిన నాసర్‌ను అత్తగారైన మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ప్రోత్సాహించారు. ఈజిప్ట్‌కి చెందిన గుర్రపు స్వారీ ఆటగాడు నాసర్.. బిల్ గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్‌ను ఈక్వెస్ట్రియన్ సర్క్యూట్‌లో కలుసుకున్నాడు. జెన్నిఫర్ కూడా ఈక్వెస్ట్రియన్‌లో నిష్ణాతురాలు. నయెల్ నాసర్, జెన్నిఫర్ గేట్స్ 2017లో డేటింగ్ చేసిన ఈ జంట 2021లో వివాహం చేసుకున్నారు.

మార్చి 2023లో వారికి మొదటి ఆడబిడ్డ పుట్టింది. గత నెలలో రెండవ బిడ్డ పుట్టబోతున్నట్టు ప్రకటించారు. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు మెలిండా, బిల్ గేట్స్ హాజరవుతారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. అయినప్పటికీ, ఇతర వీఐపీలు క్రీడా మహోత్సవం కోసం ఫ్రెంచ్ రాజధానికి విచ్చేశారు.

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ భర్త ముఖేష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీతో కలిసి శుక్రవారం ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. అంతేకాకుండా, టెస్లా బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా ఒలింపిక్స్ కోసం పారిస్‌లో ఉన్నట్లు సమాచారం. డెల్టా సీఈఓ ఎడ్ బాస్టియన్, గోల్డ్‌మన్ సాచ్స్ సీఈఓ డేవిడ్ సోలమన్ కూడా ఉన్నారు.

Read Also : Paris Olympics 2024 : భార‌త షూటర్ల గురి త‌ప్పింది.. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌, పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ లో నిరాశే..

ట్రెండింగ్ వార్తలు