Paris Olympics 2024 : భార‌త షూటర్ల గురి త‌ప్పింది.. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌, పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ లో నిరాశే..

పారిస్ ఒలింపిక్స్ 2024 మొద‌టి రోజున భార‌త్‌కు నిరాశే ఎదురైంది.

Paris Olympics 2024 : భార‌త షూటర్ల గురి త‌ప్పింది.. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌, పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ లో నిరాశే..

Paris Olympics 2024 Indians fail to qualify for men's pistol finals10m mixed rifle

పారిస్ ఒలింపిక్స్ 2024 మొద‌టి రోజున భార‌త్‌కు నిరాశే ఎదురైంది. షూట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. అంచనాలను అందుకోలేకపోయారు. పురుషుల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్‌ క్వాలిఫికేష‌న్ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్‌ చీమా లు ఫైన‌ల్ రౌండ్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయారు.

శ‌నివారం జ‌రిగిన క్వాలిఫికేష‌న్ రౌండ‌ర్ భార‌త షూట‌ర్ స‌ర‌బ్‌జోత్ సింగ్ తృటిలో అవ‌కాశాన్ని కోల్పోయాడు. ఓ ద‌శ‌లో స‌ర‌బ్‌జోత్ టాప్‌-3లో దూసుకువెళ్లాడు. అయితే.. ఆఖ‌ర‌కు 577-16X పాయిట్ల‌తో 9వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు. దీంతో ఫైన‌ల్ చేరుకునే అవ‌కాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఈ విభాగంలో టాప్‌-8 ఆట‌గాళ్లు ఫైన‌ల్‌కు చేరుకున్నారు. మ‌రోవైపు అర్జున్ చీమా 577-17X పాయింట్ల‌తో 18వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో తొలి బంగారు ప‌త‌కం సాధించిన దేశం ఏదో తెలుసా..?

మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ..

అంతక‌ముందు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఎలవెనిల్‌ వలరివన్‌- సందీప్‌ సింగ్, రమిత- అర్జున్‌ బబుతా జోడీలు నిరాశపర్చాయి. 628.7 పాయింట్లతో అర్జున్ బబుతా-రమిత ఆరో స్థానంలో నిలిచారు. వలరివన్-సందీప్ సింగ్ లు 623.6 పాయింట్లతో 12వ స్థానంతో స‌రిపెట్టుకున్నారు. అర్జున్-రమిత జోడీ ఒక్క పాయింట్‌తో కాంస్య పతక పోరుకు అర్హత సాధించలేక పోయింది.

నాలుగో స్థానంలో జోడికి అర్జున్-రమిత ద్వయానికి మధ్య అంతరం ఒక్క పాయింటు మాత్ర‌మే అంత‌రం ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ అర్జున్‌-ర‌మిత జోడీ మ‌రో పాయింట్ సాధించి ఉంటే భార‌త్ క్యాంస ప‌త‌క పోరుకు అర్హ‌త సాధించి ఉండేది.

IND vs SL : శ్రీలంక‌తో టీ20 సిరీస్‌.. మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుస్తా..?