Kamindu Mendis : శ్రీలంక స్పిన్నర్ వింత బౌలింగ్.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫన్నీకామెంట్స్

శ్రీలంక బౌలర్ కమిందు మెండిస్ వేసిన ఓవర్ వివాదాస్పదంగా మారింది. భారత్ ఇన్నింగ్స్ సమయంలో మెండిస్ 10వ ఓవర్ వేశాడు.

Kamindu Mendis

Kamindu Mendis Both Hand Bowling IND vs SL 1st T20 : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా జరిగిన తొలి టీ20లో శ్రీలంకపై భారత్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో లంక ఆటగాళ్లు తేలిపోయారు. అయితే, ఈ మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ విభిన్నంగా వేసిన బౌలింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ మారింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.

Also Read : SL vs IND: ఫస్ట్ టీ20 మ్యాచ్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం

శ్రీలంక బౌలర్ కమిందు మెండిస్ వేసిన ఓవర్ వివాదాస్పదంగా మారింది. భారత్ ఇన్నింగ్స్ సమయంలో మెండిస్ 10వ ఓవర్ వేశాడు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఉన్నారు. మెండిస్ ఓవర్లో సూర్యకుమార్ తొలి మూడు బంతులు ఆడి ఐదు పరుగులు చేశాడు. ఆ తరువాత స్ట్రైకింగ్ కు రిషబ్ పంత్ వచ్చాడు. సూర్య స్ట్రైకింగ్ లో ఉన్నప్పుడు అతను ఎడమ చేతితో బౌలింగ్ చేశాడు. రిషబ్ పంత్ స్ట్రైకింగ్ లో ఉన్నప్పుడు కుడి చేతితో బౌలింగ్ వేశాడు. ఒకే ఓవర్లో రెండు రకాలుగా బౌలింగ్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన కమిందు మెండిస్ తొమ్మిది పరుగులు ఇచ్చాడు.

Also Read : Dinesh Karthik : దినేశ్ కార్తీక్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. టెస్టుల్లో స‌చిన్ రికార్డును బ్రేక్ చేసే స‌త్తా భార‌త ఆట‌గాళ్ల‌కు లేద‌ట‌..!

కమిందు మెండిస్ బౌలింగ్ తీరుపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం అలా బౌలింగ్ చేయడం విరుద్దమని పేర్కొంటున్నారు. ఐసీసీ ఆర్టికల్ 21.1.1 రూల్ ప్రకారం.. బౌలర్ ఏ రీతిలో బౌలింగ్ చేసినా అంపైర్ కు ముందు సమాచారం ఇవ్వాలి.. అలా చేస్తే అది సరైన బాల్ అవుతుంది. లేకుంటే అంపైర్ దానిని నో బాల్ గా ప్రకటిస్తాడు. మెండిస్ తాను బౌలింగ్ మార్చివేసే సమయంలో అంపైర్ కు చెప్పడంతో అది సరైన బంతిగానే అంపైర్ ప్రకటించాడు. అయితే, ఈ మ్యాచ్ లో మెండిస్ ఒకే ఓవర్ వేయటం గమనార్హం. అంపైర్ అభ్యంతరం చెప్పడం వల్లనే మరో ఓవర్ అతను వేయలేక పోయాడని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ టీ20 సిరీస్ లో ఇండియా, శ్రీలంక జట్లు మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్ లలో కమిందు మెండిస్ బౌలింగ్ ఏ రీతిలో ఉంటుందో చూడాల్సిందే.

 

 

ట్రెండింగ్ వార్తలు