SL vs IND: భారత్, శ్రీలంక ఫస్ట్ టీ20 మ్యాచ్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం

మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి.

SL vs IND: భారత్, శ్రీలంక ఫస్ట్ టీ20 మ్యాచ్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం

టార్గెట్ 213 పరుగులు
శ్రీలంక ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ 40, శుభ్‌మన్ గిల్ 34, సూర్యకుమార్ యాదవ్ 58, రిషబ్ పంత్ 49, హార్దిక్ పాండ్యా 9, రియాన్ పరాగ్ 7, రింకూ సింగ్ 1, అక్షర్ పటేల్ 10 (నాటౌట్), అర్ష్ దీప్ సింగ్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 213-7 పరుగులు చేసింది.

యశస్వి జైస్వాల్ అవుట్
74 పరుగుల వద్దే టీమిండియా రెండో వికెట్ నష్టపోయింది. యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు. భారత్ 10 ఓవర్లలో 111/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ 28, రిషబ్ పంత్ 9 పరుగులతో ఆడుతున్నారు.

గిల్ అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
టీమిండియా 74 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శుభమన్ గిల్ 16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 34 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లోకి వచ్చాడు.

టీమిండియా 5 ఓవర్లలో 59/0
టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా దూకుడుగా ఆడుతోంది. తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పరుగులు చేసింది. శుభమన్ గిల్ 20, యశస్వి జైస్వాల్ 40 పరుగులతో ఆడుతున్నారు.

టాస్ గెలిచిన శ్రీలంక
SL vs IND: మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా నేడు జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో సంజూ శాంస‌న్‌కు చోటు దక్కలేదు. టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గావ్యవహరిస్తున్నాడు. కాగా, టీ20 ప్రపంచకప్ గెలిచి జోరు మీదున్న టీమిండియా శ్రీలంక సిరీస్‌లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో లీగ్ దశ నుంచి ఇంటిముఖం పట్టిన శ్రీలంక ఈ సిరీస్‌లో రాణించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

 

తుది జట్లు

భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక