Dinesh Karthik : దినేశ్ కార్తీక్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. టెస్టుల్లో స‌చిన్ రికార్డును బ్రేక్ చేసే స‌త్తా భార‌త ఆట‌గాళ్ల‌కు లేద‌ట‌..!

ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్ మాత్ర‌మే స‌చిన్ రికార్డుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు

Dinesh Karthik : దినేశ్ కార్తీక్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. టెస్టుల్లో స‌చిన్ రికార్డును బ్రేక్ చేసే స‌త్తా భార‌త ఆట‌గాళ్ల‌కు లేద‌ట‌..!

Joe Root could surpass Sachins Test runs record thinks Karthik

Dinesh Karthik – Sachin Tendulkar : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పాడు. టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు ఇందులో ఒక‌టి. టెండూల్క‌ర్ త‌న కెరీర్‌లో 200 టెస్టు మ్యాచులు ఆడాడు. 15,921 ప‌రుగులు చేశాడు. ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ 13,378 ప‌రుగుల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్ మాత్ర‌మే స‌చిన్ రికార్డుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. రూట్ ఇప్ప‌టి వ‌ర‌కు 143 టెస్టుల్లో 11,942 ప‌రుగుతు చేశాడు. కాగా.. స‌చిన్ రికార్డును రూట్ బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని భార‌త మాజీ ఆట‌గాడు దినేశ్ కార్తీక్ అన్నాడు. ప్ర‌స్తుతం రూట్ అద్భుత ఫామ్‌లో ఉండ‌డం కూడా ఓ కార‌ణమ‌ని చెప్పాడు.

Paris Olympics 2024 : భార‌త షూటర్ల గురి త‌ప్పింది.. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌, పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ లో నిరాశే..

రూట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 143 టెస్టుల్లో 11,942 ప‌రుగులు చేశాడు. స‌చిన్ 200 టెస్టులు ఆడాడు. మ‌రో ఆరు సంవ‌త్స‌రాల పాటు రూట్ ఆడే అవ‌కాశం ఉంది. క‌నీసం 4500 ప‌రుగులు చేసే అవ‌కాశం ఉంది. స‌చిన్ రికార్డును బ‌ద్దలు కొట్టొచ్చు.

రూట్ అద్భుత ఆట‌గాడు కావ‌డంతో ఇది సాధ్యం అయ్యే ప‌నే. అయితే.. వ‌చ్చే ఆరు సంవ‌త్స‌రాల పాటు అత‌డు ఫిట్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే అప్ప‌టికి అత‌డికి 39 ఏళ్ల వ‌స్తాయి. ఆ ఏజ్‌లో ఫిట్‌గా ఉండ‌డం అంత సుల‌భం కాదు. కానీ గ‌ణాంకాల ప‌రంగా చూస్తే సాధ్యం అవుతుంది అని కార్తీక్ అన్నాడు.

IND vs SL : శ్రీలంక‌తో టీ20 సిరీస్‌.. మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుస్తా..?

కాగా.. ప్ర‌స్తుతం కోహ్లీ (8,848), విలియ‌మ్స‌న్ (8,743) లు స‌చిన్ రికార్డుకు చాలా దూరంలో ఉన్నారు.

టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్‌-5 ఆట‌గాళ్లు..

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 200 టెస్టుల్లో 15,921 ప‌రుగులు
రికీపాంటింగ్ (ఆస్ట్రేలియా) – 168 టెస్టుల్లో 13,378 ప‌రుగులు
జాక్వ‌స్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) – 166 టెస్టుల్లో 13,289 ప‌రుగులు
రాహుల్ ద్ర‌విడ్ (భార‌త్‌) – 164 టెస్టుల్లో 13,288 ప‌రుగులు
అలెస్ట‌ర్ కుక్ (ఇంగ్లాండ్‌) – 161 టెస్టుల్లో 12,472 ప‌రుగులు.