Tech Tips in Telugu : ChatGPT ఇప్పుడు మాట్లాడగలదు.. వినగలదు.. చూడగలదు.. ఈ కొత్త ఏఐ వాయిస్, ఇమేజ్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?

Tech Tips in Telugu : ఇది విన్నారా? ఏఐ ఆధారిత (AI) కంపెనీ ఓపెన్‌ఏఐ (OpenAI) చాట్‌జీపీటీ (ChatGPT) సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ల సాయంతో యూజర్లు మాట్లాడటమే కాదు.. వినవచ్చు.. చూడవచ్చు.. ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం..

Tech Tips in Telugu : ChatGPT can now speak, hear and see _ how to use new voice and image capabilities

Tech Tips in Telugu : ఏఐ ఆధారిత చాట్​‌జీపీటీ (ChatGPT) అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త వాయిస్, ఇమేజ్ సామర్థ్యాలతో యూజర్లు సులభంగా కమ్యూనికేషన్ చేయొచ్చు. కొత్త ఫీచర్ల సాయంతో ఏఐ చాట్‌జీపీటీ ఇప్పుడు యూజర్లతో మాట్లాడగలదు.. చెప్పేది వినగలదు.. అన్ని చూడగలదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence ChatGPT) ఆధారంగా ఈ చాట్‌జీపీటీ వాయిస్​ కమాండ్స్, ఫొటో క్యాపబిలిటీ ఫీచర్లను తీసుకొచ్చింది.

యూజర్లు చాట్​జీపీటీతో నేరుగా మాట్లాడుకోవచ్చు. చాట్​జీపీటీ అందించే వాయిస్ కమాండ్స్ ద్వారా ఏఐ డేటాను యాక్సస్ చేసుకోవచ్చు. వినియోగదారులు అడిగే ప్రతి ప్రశ్నను నిశితంగా అర్థం చేసుకోగలదు.. అంతే వేగంగా ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలదు.

ChatGPTతో వాయిస్ కమాండింగ్ :
చాట్‌జీపీటీ వాయిస్ కమాండ్స్ ద్వారా యూజర్లు ఏఐ అసిస్టెంట్‌తో రియల్ టైమ్ డేటా యాక్సస్ చేసుకోవచ్చు. మీరు ప్రయాణంలో ఉన్నా, మీ కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నా లేదా డిన్నర్ టేబుల్ బుక్ చేసినా, చాట్‌జీపీటీ వాయిస్ సామర్థ్యాలు అద్భుతంగా సాయపడతాయి.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో కొత్త PVC కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

వాయిస్ అసిస్టెంట్ ఫీచర్​ ఎనేబుల్ చేయాలంటే? :
* మీ ఫోన్లో మొబైల్ చాట్‌జీపీటీ యాప్‌ ఓపెన్ చేయండి.
* Settings మెనుకి నావిగేట్ చేయండి.
* వాయిస్‌ అసిస్టెంట్ ఎనేబుల్ చేయండి.
* అక్కడ ‘New Features’ ఎంచుకోవాలి.
* అనంతరం వాయిస్ కమాండ్స్ పంపండి.
* అందులో 5 విభిన్న వాయిస్‌లను ఎంచుకోవచ్చు.
* హోమ్ స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో హెడ్‌ఫోన్ ఐకాన్ నొక్కండి.

ఈ వాయిస్‌ హ్యుమన్ లాంటి ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్లతో రూపొందించారు. అదనంగా, విస్పర్, (OpenAI) ఓపెన్-సోర్స్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, మాట్లాడే పదాలను టెక్స్ట్‌గా కస్టమైజ్ చేయగలదు. అలాగే, మొత్తం వాయిస్ క్వాలిటీని మెరుగుపర్చగలదు.

Tech Tips in Telugu : ChatGPT new voice and image capabilities

చాట్‌జీపీటీతో ఇమేజ్​ ఇంటరాక్షన్​ :
గేమ్‌ను మార్చే మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. (ChatGPT) తో ఫొటోలను షేరింగ్ చేసుకోవచ్చు. సమస్యలను పరిష్కరంతో పాటు కంటెంట్‌ను అన్వేషించడానికి లేదా సంక్లిష్ట డేటాను విశ్లేషించడానికి వినియోగదారులు ఇప్పుడు చాట్‌జీపీటీని అడగవచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫొటోలను యాక్సస్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఉపయోగించడానికి ఫొటోను క్యాప్చర్ చేయడానికి లేదా ఎంచుకోవడానికి ఫొటో బటన్‌ను నొక్కండి.

మీ ఐఫోన్ (iOS) లేదా (Android) ఫోన్లలో మల్టీ ఫొటోలను యాడ్ చేసేందుకు ముందుగా (+) బటన్‌ను నొక్కండి. లేదంటే.. డ్రాయింగ్ టూల్ ఉపయోగించండి. ఈ ఫొటో సామర్థ్యాలు GPT-3.5, GPT-4తో సహా మల్టీమోడల్ మోడల్‌ల ద్వారా అందిస్తుంది. అంతేకాదు.. ఫొటోలు, స్క్రీన్‌షాట్‌లు, టెక్స్ట్, ఇమేజ్‌లను కలిగిన డాక్యుమెంట్‌ల వంటి వ్యూ కంటెంట్‌ యాక్సస్ చేసుకోవచ్చు.

సెక్యూరిటీ పరంగా క్రమంగా విస్తరణ :
వాయిస్, ఇమేజ్ సామర్థ్యాల విస్తరణ తదుపరి రెండు వారాల్లో ప్లస్, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు క్రమంగా అందించనుంది. iOS, Android ప్లాట్‌ఫారమ్‌లలో వాయిస్ అందుబాటులో ఉంది. సెట్టింగ్స్ ద్వారా ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే ఫొటోలు అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ అధునాతన సామర్థ్యాలతో సంబంధం ఉన్న అనేక ప్రమాదాలను ( OpenAI ) గుర్తిస్తుంది. వాయిస్‌కు సంబంధించి వాయిస్ చాట్‌పై దృష్టిసారించింది.

సాంకేతిక భద్రత దృష్ట్యా ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్ల సహకారంతో టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ముఖ్యంగా, Spotify వాయిస్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కోసం ఈ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. పాడ్‌క్యాస్టర్‌ల సొంత వాయిస్‌లను ఉపయోగించి కంటెంట్‌ని వివిధ భాషల్లోకి ట్రాన్సులేట్ చేయడం ద్వారా విస్తరిస్తోంది. ఇమేజ్ ఇన్‌పుట్‌కు సంబంధించి, యూజర్ల ప్రైవసీకి తగినట్టుగా చాట్ జీపీటీ సామర్థ్యాన్ని పరిమితం చేసేందుకు OpenAI చర్యలు తీసుకుంది.

Read Also : Tech Tips in Telugu : BHIM యూపీఐ ద్వారా UPI PIN రీసెట్ చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు