Smartphones: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లు

ల్యాప్‌ట్యాప్‌లో అందే ఫీచర్లు అన్నీ మొబైల్ ఫోన్స్ లో దొరుకుతుంటే ఇక ఓ మాదిరి అవసరాలకు కంప్యూటర్ కో, ల్యాప్ ట్యాప్ వైపుకో ఎందుకు మరలుతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా...

Smartphones: ల్యాప్‌ట్యాప్‌లో అందే ఫీచర్లు అన్నీ మొబైల్ ఫోన్స్ లో దొరుకుతుంటే ఇక ఓ మాదిరి అవసరాలకు కంప్యూటర్ కో, ల్యాప్ ట్యాప్ వైపుకో ఎందుకు మరలుతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న గ్యాడ్జెట్స్ లో మొబైల్స్ ముందు నిలిచాయట. వాటిల్లోనూ అధికంగా అమ్ముడైన టాప్ 5లో నాలుగు యాపిల్ ప్రొడక్ట్‌లే. టాప్ 2 స్థానం మాత్రం శాంసంగ్ దక్కించుకుంది.

ప్రపంచ మొబైల్ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఐఫోన్ అమ్మకాలు జరుగుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. 2021 ఏడాదిలో తొలి తొమ్మిది నెలల్లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన తొలి ఐదు స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్లు, శామ్‌సంగ్ మొబైల్ నిలిచాయని ఐడీసీ విడుదల చేసిన డేటాలో తెలుస్తోంది.

ప్రపంచ అమ్మకాల పరంగా చూస్తే ఐఫోన్ 12 మొదటి స్థానంలోను, శామ్‌సంగ్ ఏ12 రెండో స్థానంలో, ఐఫోన్ 11 మూడో స్థానంలో, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ నాల్గో స్థానంలో, ఐఫోన్ 12 ప్రో ఐదో స్థానంలో నిలిచాయి. 2021 మొదటి మూడు నెలల్లో ఐఫోన్ 12 ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ ఫోన్‌గా నిలిచింది.

………………………………….. : అతిగా తింటే…అనర్ధమేనా?…

2021లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌గా శామ్ సంగ్ గెలాక్సీ ఏ12 మాత్రమే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ ఫోన్‌లలో టాప్ 5లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఈస్మార్ట్‌ ఫోన్ 5వేల ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రూ.15వేల 599గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు