Vivo X90 Series : వచ్చేవారమే వివో X90 సిరీస్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Vivo X90 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. Vivo X90 సిరీస్ వచ్చే వారం లాంచ్ కానుందని భావిస్తున్నారు. రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. కొత్త Vivo ఫోన్ నవంబర్ 22న వస్తుందని ప్రోమో వీడియో వెల్లడించింది.

Vivo X90 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. Vivo X90 సిరీస్ వచ్చే వారం లాంచ్ కానుందని భావిస్తున్నారు. రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. కొత్త Vivo ఫోన్ నవంబర్ 22న వస్తుందని ప్రోమో వీడియో వెల్లడించింది. Vivo నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే లాంచ్ చేయనుంది. Vivo X80 లాంచ్ అయిన ఆరు నెలల తర్వాత ఈ ఏడాదిలో ఏప్రిల్‌లో తిరిగి చైనాలో లాంచ్ అయింది. కంపెనీ కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Vivo X90 కూడా భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. Vivo X80 చైనాలో లాంచ్ చేసిన ఒక నెల తర్వాత భారత మార్కెట్లో లాంచ్ అయింది.

కంపెనీ Vivo X90ని వచ్చే నెలలో లేదా రాబోయే వారాల్లో భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. పాత వెర్షన్‌ల మాదిరిగానే అందుబాటులోకి రానుంది. Vivo X80 సిరీస్ ఇప్పటికే ఒక ఫోటోగ్రఫీ స్మార్ట్‌ఫోన్‌గా అందుబాటులోకి రానుంది. వివో యూజర్ల కోసం మెరుగైన వెర్షన్‌ను లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. Vivo రెండు మోడళ్లను ప్రకటించే అవకాశం ఉంది. స్టాండర్డ్, ప్రో వెర్షన్, రెగ్యులర్ వెర్షన్ వివరాలు తెలియలేదు. Vivo X90 Pro గురించి వివరాలు ఆన్‌లైన్‌లో వచ్చాయి. వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుందని తెలిపింది. సోనీ IMX989 ప్రైమరీ చిప్‌సెట్ ఉంటుందని లీక్ చెబుతోంది.

Vivo X90 Series likely to launch next week Check out leaked features

వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన తక్కువ కాంతి ఫొటో, మెరుగైన ఫోటోగ్రఫీతో Vivo V2 ISP చిప్ ద్వారా సపోర్టు అందిస్తుంది. కంపెనీ షేర్ చేసిన కొన్ని కెమెరా మోడల్స్ Vivo X80 Pro DSLR లాంటి ఫొటోలను డైనమిక్ రేంజ్‌తో అందించగలదు. కలర్ కాంట్రాస్ట్ బాగా బ్యాలెన్స్‌డ్ ఎక్స్‌పోజర్‌తో రానుంది. కెమెరా క్వాలిటీ ఆటోమాటిక్‌గా టెస్టింగ్ చేసుకోవచ్చు. Vivo X90+ గతంలో గీక్‌బెంచ్‌లో Qualcomm లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుందని తెలిపింది. 12GB LPDDR5X RAM ద్వారా సపోర్టు అందిస్తుంది. హ్యాండ్‌సెట్ భారీ 6.78-అంగుళాల కర్వడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz వద్ద రిఫ్రెష్ కానుంది. 4,700mAh బ్యాటరీతో రానుందని నివేదికలు సూచించాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vivo V25 4G వేరియంట్ లాంచ్ అప్పుడే.. Vivo V25e ఫీచర్లతోనే రావొచ్చు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు