Election Duty : ఎన్నికల విధులకు గైర్హాజరు.. 40 మందిపై సస్పెన్షన్ వేటు!

Election Duty : ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మందిలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Election Duty : తెలంగాణలో ఎన్నికల విధులకు హాజరుకాని 40 మంది పీఓలు, ఏపీఓపై సస్పెన్షన్ వేటు పడింది. పలు సెక్షన్లకు సంబంధించిన అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎలక్షన్ ట్రైనింగ్ కోసం హాజరుకావాలంటూ పలుమార్లు పడేపదే ఆదేశాలు జారీచేసినా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన అధికారులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం (అర్‌పీ ఆక్ట్) 1951 ఉల్లంఘన కింద సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మందిలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నెల 9,10వ తేదీలలో జరుగు శిక్షణ తరగతులకు హాజరుకాని వారిపై కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హెచ్చరించారు.

Read Also : Vijayasai Reddy : ప్రభుత్వం వచ్చాక ఆ అధికారులపై చర్యలు ఉంటాయి- విజయసాయిరెడ్డి వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు