WhatsApp Login Feature : వాట్సాప్‌లో సరికొత్త లాగిన్ అప్రూవల్ ఫీచర్.. ఇక హ్యాకర్లకు చెక్ పడినట్టే..!

WhatsApp Login Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రత్యేకించి సెక్యూరిటీ ఫీచర్లపై వాట్సాప్ దృష్టిపెట్టింది. యూజర్ల భద్రత ప్రధానంగా మెసేజింగ్ యాప్ పనిచేస్తోంది.

WhatsApp Login Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రత్యేకించి సెక్యూరిటీ ఫీచర్లపై వాట్సాప్ దృష్టిపెట్టింది. యూజర్ల భద్రత ప్రధానంగా మెసేజింగ్ యాప్ పనిచేస్తోంది. నివేదికల ప్రకారం.. వాట్సాప్ తమ ఇన్‌స్టాగ్రామ్ వంటి లాగిన్ అప్రూవల్ (Login Approval Feature) ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. ఈ కొత్త డివైజ్ నుంచి మీ WhatsApp అకౌంట్ లాగిన్ అయినప్పుడు మెసేజింగ్ యాప్ నుంచి నోటిఫికేషన్ పొందవచ్చు. ఇంతకీ మీ వాట్సాప్ అకౌంట్లో లాగిన్ అయిందో మీరేనా కాదా అనేది అడుగుతుంది.

కొత్త కంప్యూటర్ నుంచి Instagram లేదా Facebook అకౌంట్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఇలాంటి నోటిఫికేషన్‌లను వస్తుంటాయి. WhatsApp రాబోయే ఫీచర్ ప్లాట్‌ఫారమ్ సెక్యూరిటీని మరింత పెంచుతుంది. కొత్త డెవలప్‌మెంట్‌ గురించి అప్‌డేట్ మొదట వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ Wabetainfo గుర్తించింది. రాబోయే అన్ని ఫీచర్లపై ముందుగానే తెలియజేసే వెబ్‌సైట్ యూజర్లను ప్రొటెక్ట్ చేయడానికి WhatsApp కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోందని నివేదించింది. తద్వారా ఎవరైనా వారి అకౌంట్లలో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే.. యాప్‌లో వార్నింగ్ పొందవచ్చు. మీలో ఎవరైనా WhatsApp అకౌంట్లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమోదించడం ద్వారా లాగిన్ అభ్యర్థనను అంగీకరించాలి.

WhatsApp Login Feature WhatsApp’s upcoming login approval feature will keep hackers away

వాట్సాప్ యూజర్లు 6-అంకెల కోడ్‌ను తప్పుగా షేర్ చేసినట్టు అయితే.. ఎవరైనా తమ అకౌంట్లలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. చివరకు లాగిన్ అభ్యర్థనను తిరస్కరించవచ్చు. అదనంగా, ఈ స్పెషల్ సెక్యూరిటీ వార్నింగ్ ఫీచర్ ఇతర ఫోన్‌కు సంబంధించిన సమయం, ఇతర డేటా వంటి కొన్ని ఇతర ఉపయోగకరమైన వివరాలను కూడా నివేదిస్తుందని వెబ్‌సైట్ పేర్కొంది.

వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు గమనిక :
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు (Whatspp Group Admins) మరిన్ని కంట్రోల్స్ అందించేందుకు మెసేజింగ్ దిగ్గజం కృషి చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా తప్పుడు డేటా వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. గ్రూప్ అడ్మిన్ మరింత అప్రమత్తంగా ఉండాలి. గ్రూప్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి. త్వరలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మెసేజ్ డిలీట్ చేయమని Wabetainfo నివేదించింది. ప్రస్తుతానికి, ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లు మాత్రమే ఈ ఫీచర్‌కి యాక్సెస్‌ను కలిగి ఉన్నారు. రాబోయే రోజుల్లో WhatsApp దీన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టులకు అందుబాటులో ఉంది.

Read Also : WhatsApp Group Admin: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఎవరి మెసేజ్‌నైనా అడ్మిన్ డిలీట్ చేసే అవకాశం

ట్రెండింగ్ వార్తలు