KCR on Haragopal : ప్రొ.హరగోపాల్ మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయండి.. డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్‌ పేరు ఉందని కేసులో పేర్కొన్న పోలీసులు.. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌‭మెంట్‌ అధ్యక్షులు చంద్రమౌళి బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా కేసును బయటపెట్టారు.

KCR on Haragopal Case: ప్రొఫెసర్ హరగోపాల్ సహా ఇతరుల మీద పెట్టిన UAPA కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ డీజీపిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మీద 2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌‭లో కేసు నమోదైంది. UAPA, ఆర్మ్స్‌ యాక్ట్‌‭ సహా మరో పది సెక్షన్ల కింద హరగోపాల్‌ మీద తాడ్వాయి పోలీసులు కేసులు నమోదు చేశారు.

Supriya Sule: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ‘అమితాబ్ బచ్చన్’ అంటూ చమత్కరించిన సుప్రియా సూలే

మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్‌ పేరు ఉందని కేసులో పేర్కొన్న పోలీసులు.. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌‭మెంట్‌ అధ్యక్షులు చంద్రమౌళి బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా కేసును బయటపెట్టారు. కాగా, హరగోపాల్‌ మీద UAPA కేసు నమోదు చేయడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వెంటనే హరగోపాల్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

Tamilandu Politics: కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీపై ట్విటర్‭లో విమర్శలు.. బీజేపీ జనరల్ సెక్రెటరీ అరెస్ట్

దీనికి ముందు ప్రొఫెసర్‌ హరగోపాల్‌‌ మాట్లాడుతూ సమాజం చైతన్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. తాను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇటువంటి కేసులపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూస్తానని చెప్పారు. ఉద్యమపార్టీ అని కేసీఆర్ పార్టీని గౌరవించామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి వచ్చింది కాబట్టి ఆ పార్టీ పాలన ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుందని అనుకున్నామని చెప్పారు.

Buddha Venkanna : సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే సీఎం జగన్ ఎందుకు స్పందించట్లేదు : బుద్ధా వెంకన్న

తాము ఏది చేసినా చెల్లుతుందని పోలీసులు భావిస్తున్నారని తెలిపారు. సర్కారుని విమర్శిస్తే అది రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కాదని హరగోపాల్ అన్నారు. రాజద్రోహం కేసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడాలని ఆయన అన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌‌ పై దేశ ద్రోహం కేసు పెట్టడంతో దీనిపై పలువురు నేతలు మండిపడుతున్నారు.

RS Praveen Kumar : అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలిస్తాం, ఆంధ్ర ప్రాంత వలసవాదులను ఓడించాలి- ఆర్ఎప్ ప్రవీణ్ కుమార్

స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ
ప్రొఫెసర్ హరగోపాల్ మీద కేసును వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని మద్దతు తెలిపారని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశానికి తెలిసే విధంగా ఆయన ప్రసంగాలు చేశారని గుర్తు చేశారు. ఇక మిగిలిన వారిపై పెట్టిన కేసులను సైతం ఎత్తివేయాలని నారాయణ కోరారు.

ట్రెండింగ్ వార్తలు