Deepthi Case: కోరుట్ల దీప్తిది హత్యేనని తేల్చేసిన పోలీసులు?

దీప్తి నోటికి ప్లాస్టర్ వేసి, అలాగే ముఖానికి చున్నీ చుట్టి తన ప్రియుడితో వెళ్లిపోయినట్టు చందన అంగీకరించినట్లు తెలుస్తోంది.

software employee Deepti death

Deepthi Case – Crime: జగిత్యాల జిల్లాలో సంలచనం రేపిన కోరుట్ల దీప్తి మృతి కేసులో పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టారు. కోరుట్ల దీప్తిది హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీప్తి మృతి చెందినప్పటి నుంచి ఆమె సోదరి చందన కనపడకుండా పోయింది.

దీంతో చందన కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఆమెతో పాటు మరో ఇద్దరు యువకులకు అదుపులోకి తీసుకున్నారు. దీప్తి నోటికి ప్లాస్టర్ వేసి, అలాగే ముఖానికి చున్నీ చుట్టి తన ప్రియుడితో తాను వెళ్లిపోయినట్టు చందన అంగీకరించినట్లు తెలుస్తోంది. బాయ్ ఫ్రెండ్, మరో బంధువు, కారు డ్రైవర్ తో కలిసి చందనే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చందన బీటెక్ చదువుతోంది. కాలేజీలో సీనియర్ అయిన ఓ యువకుడితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో చందన పెళ్లిని ఆమె తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు లేని సమయంలో అక్క దీప్తితో చందన ఇంట్లో గొడవపడింది.

అప్పుడే దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శ్వాసఆడక దీప్తి మృతి చెందిందని పోలీసులు భావిస్తున్నారు. దీప్తి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ అందాక, ఇవాళ సాయంత్రం పోలీసులు మీడియాకు వివరాలు తెలిపే అవకాశం ఉంది.

Crime News: మణిపూర్‌ తరహా ఘటన.. రాజస్థాన్‌లో యువతిని నగ్నంగా ఊరేగించి, వీడియోలు తీసి..

ట్రెండింగ్ వార్తలు